సమస్త
ప్రాణకోటికి ప్రత్యేక్ష దైవం సూర్యభగవానుడు, అన్ని జీవులకు ప్రాణదాత,
ఆరోగ్యప్రదాత. సూర్యుడు ఉదయం బ్రహ్మ స్వరూపముగానూ, మధ్యాహ్నం శివుడుగాను, సాయంత్రం వేళ
విష్ణువుగానూ ఉంటాడని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ప్రతిరోజూ ప్రత్యక్ష దైవం అయిన సూర్యభగవానుడిని
అర్చించిన వారికి ఆయురారోగ్యఐశ్వర్యాలు ప్రాపిస్తాయంటారు. సృష్టిలోని అన్ని ప్రాణులకు
ప్రాణశక్తిని ప్రసాదిస్తున్న ప్రత్యక్ష దైవం సూర్యభగవాడిని మనసారా
ప్రార్థిస్తాం.
Friday, 31 January 2020
Saturday, 4 January 2020
నవ్వుల జల్లుల 'ప్రతిరోజూ పండగే'
మరణాన్ని కూడా పండుగలా చేసుకోవాలన్న పాయింటుతో రూపొందించిన చిత్రం 'ప్రతి రోజూ పండగే'. కన్నతండ్రి ఐదు వారాల్లో చనిపోతాడని తెలిస్తే ఈ కాలం ఎన్నారై కొడుకుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో అన్న పాయింటు కూడా జతచేసి కాస్త ఫన్, కాస్త ఎమోషన్ ఉండే సీన్లతో అల్లుకున్నాడు దర్శకుడు. ఈ చిత్రానికి టైటిల్ వల్ల మంచి క్రేజీ ఏర్పడింది. సినిమా మొదట్లో హడాహుడి లేకుండా స్మూత్ గా సాగిపోతుంది. చూస్తున్నంత వరకూ 'శతమానం భవతి' సినిమా కళ్ళల్లో మెదులుతుంది. ఇక కథలోకి వస్తే, పిల్లలు విదేశాల్లో స్థిరపడితే రఘురామయ్య పల్లెటూరిలో ఒంటరిగా మిగిలిపోతాడు. ఆయనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతుంటారు. ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్ కేవలం ఐదు వారాల్లో చనిపోతాడని చెప్పడంతో మనవడు సాయిధరంతేజ్ హుటాహుటిగా తాత దగ్గరకు వచ్చేస్తాడు. హీరో, కుటుంబసభ్యులంతా విలేజ్ లోకి దిగిపోయాక సినిమా వేగం అందుకుంటుంది. హీరో, హీరోయిన్ల లవ్ సీన్లు పెద్దగా లేవు. అంతేకాదు కామెడీ సీన్లు పండినంతగా ఎమోషన్ సీన్లు పండలేదు. రెండు పాటలు ఫర్వాలేదు. సాయితేజ్ పాత్రకు తగ్గట్టు నటించాడు. రఘురామయ్యగా నటించిన సత్యరాజ్ ఎమోషన్ సీన్లలో బాగానే నటించాడు. కామెడీ సీన్లలో రావు రమేష్ కడుపుబ్బా నవ్వించాడు. రావు రమేష్, సత్యరాజ్ ఈ సినిమాకు బాగా ఉపయోగ పడ్డారు. అన్ని వర్గాలప్రజలను అలరించడంలో దర్శకుడు మారుతి సక్సెస్ అయ్యాడు. నేటి యువత చూడాల్సిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'.
Subscribe to:
Posts (Atom)