”శోధిని”

Wednesday, 20 June 2018

"యోగామృతం"


యోగ' అనేది ఏ మతానికో, సంస్కృతికో సంబంధించింది కాదు. ఇది సర్వజనుల శరీర ఆరోగ్యానికి సంబందించినది. మనిషి ఒత్తడిని తగ్గించి, శరీరానికి, మనసుకు అవసరమైన ప్రశాంతతను అందించే సంజీవిని. ప్రకాశవంతమైన ప్రేమకాంతిని వెదజల్లి, వ్యక్తి చుట్టూ ప్రశాంతమైన, పరిపూర్ణమైన వాతావరణాన్ని కలిగించే అమృతవాహిని. అంతేకాకుండా అసూయ, ద్వేషం, భయం, శోకం, దుఃఖం వంటి మానసిక ఆందోళనలను తగ్గించి కుళ్ళు, కుతంత్రాలను దూరం చేసే సంపూర్ణ ఆరోద్యప్రదాయిని. శరీరాన్ని తేలిక పరచి జీవనశైలిలో మంచి మార్పును తీసుకొచ్చి, అనేక రుగ్మతలకు పరిష్కారం చూపే గొప్ప సాధనం 'యోగ'.

Friday, 15 June 2018

రంజాన్ శుభాకాంక్షలు!




చెడు నుంచి తనను తాను ఎలా కాపాడుకోవాలి, సన్మార్గంలో నడిచేందుకు ఎలా వ్యవహరించాలి, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారితో ఎలా వ్యవహరించాలి అనే విషయాలు ఖురాన్ గ్రంధంలో వివరంగా వివరించబడింది. పవిత్ర ఖురాన్ గ్రంధం అవతరించింది కూడా రంజాన్ మాసంలోనే. అందువల్ల ముస్లిం సోదరులు ఈ నెలలో నిత్యo ఖురాన్ చదవటంలో నిమగ్నమై ఉంటారు.   రంజాన్ నెలలో ఈ గ్రంధాన్ని చదివినా, ఇతరులు చదవగా విన్నా అధిక పుణ్యం లభిస్తుందంటారు.  అందుకే ఈ నెలలో ఎక్కువ సమయం ఖురాన్ గ్రంధ పారాయణంలో, వినడంలో గడుపుతారు. అమావాస్య తర్వాత కనిపించే నెలవంకను చూసిన పిమ్మట రంజాన్ ఉపవాసాలు ముగించి  ఆనందం విరిసిన హృదయంతో రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికి  'రంజాన్' పర్వదిన శుభాకాంక్షలు!


Thursday, 14 June 2018

రైతుల కళ్ళల్లో ఆనందం







వర్షాలు బాగా కురవాలి
పంటలు బాగా పండాలి
రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి

Sunday, 3 June 2018

గరుడాద్రి



దాయాదులయిన కద్రువ పుత్రులను సంహరించిన గరుత్మంతుడు,  పాపపరిహారార్థం విష్ణువును గూర్చి తపస్సు చేశాడట.  స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠo చేరే వరమివ్వమని ప్రార్థించాడట.   దానికి స్వామి, తానే ఏడుకొండల మీద  వెలియనున్నానని తెలిపి... ఆ గరుత్మంతుడుని కూడా శైలరూపంలో అక్కడే ఉండమని ఆదేశించాడట.  అదే గరుడాద్రి.