Sunday, 27 March 2016
Tuesday, 22 March 2016
నీటి పొదుపు అంటే ఇదేనా ?
ఒక చిత్రంలో 'నీటి పొదుపు' మహోధ్యమంలో పాల్గొన్న యువత.
మరో చిత్రంలో 'హోలీ' పేరుతో బక్కెట్ల బక్కెట్ల నీళ్ళు వృధా చేస్తున్న యువత. రాష్ట్రంలో నీటి కొరత వేధిస్తోంది. హోలీ పేరుతో ఇలా నీటిని వృధా చేయడం ఎంతవరకు సమంజసం యువత ఆలోచించాలి. మన సంప్రదాయం ప్రకారం సహజ రంగులతో హోలీ ఆడి, స్నానం చేస్తే, ఎంతో అముల్యమైన నీటిని ఆదా చేసినట్లు అవుతుంది.
Sunday, 20 March 2016
Friday, 11 March 2016
Monday, 7 March 2016
మహిళలు ..మహారాణులు !
మనవ సమాజంలో మహిళల పాత్ర మహోన్నతమైనది. మాతృత్వం, ప్రేమ, సహనం, త్యాగం ఆమె సొత్తు. తల్లిగా, భార్యగా, కూతురిగా, సోదరిగా మమతానురాగాలకు మహిళ పెట్టింది పేరు. అయితే, పురుషాధిక్య సమాజంలో అత్యాచారాలు, ఆత్మహత్యలు స్త్రీకి శాపాలుగా మారాయి. ఎన్ని చట్టాలు చేసినా,ఎన్ని శిక్షలు వేసినా ఈ ఆగడాల పరంపరలు కొనసాగుతూనే ఉన్నాయి. జన్మనిచ్చిన తల్లి లాంటి స్త్రీని హింసించడం అమానుషం. వీటిని ఎదుర్కోవడానికి ప్రతి మహిళ ఓ ఝాన్సీ లక్ష్మిభాయిలా ఉద్భవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీలను కన్నతల్లిలాగా గౌరవించినప్పుడే దేశం ప్రగతిపథంలో పయనిస్తుంది.
Sunday, 6 March 2016
శంభో శంకర నమో నమో ...!
శివరాత్రి భక్తులకు అత్యంత పర్వదినం. ఈ రోజున ఉపవాసం ఉంటూ పరమేశ్వరుడ్ని ఆరాధించి, జాగారణ చేస్తే అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయని శివపురాణం చెబుతుంది. శివారాత్రి రోజున శివునికి దగ్గరగా ఉంటూ, ఆయన నామాన్ని స్మరిస్తూ... ఆరాధించాలి. శివుడ్ని స్తుతిస్తూ... కీర్తిస్తూ ఉపవాసంతో కూడిన జాగారం చేయాలి. ఆయన కోరుకునేది చెంబుడు నీళ్ళతో అభిషేకం, గుప్పెడు బిల్వపత్రాలు మాత్రమే! ఇలా చేయడం వల్ల ఆయన ఆనందంతో పొంగిపోతాడు. శివరాత్రి రోజున 'ఓం నమఃశ్శివాయ' అంటూ పంచాక్షరీ శివనామ స్మరణతో శివాలయాలన్నీ మరుమ్రోగుతాయి. భక్తితో భక్తుల హృదయాలు పులకించిపోతాయి.
మిత్రులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు !
మిత్రులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు !
Thursday, 3 March 2016
Wednesday, 2 March 2016
"నిజం నిప్పులాంటిది"
"నీ స్నేహితుడ్ని అతి దారుణంగా కాల్చి చంపావంటున్నారు పోలీసులు నిజమేనా?" బోనులో నిలబడ్డ వ్యక్తిని అడిగాడు లాయర్.
" ఈ హత్య నేను చేయలేదు సార్ ! " చెప్పాడు నేరస్థుడు
"అయితే పిస్తోల్ పైన నీ వేలి ముద్రలు ఉన్నాయంటున్నారు"
"వాళ్ళు చెప్పేది పచ్చి అబద్దం! అవి నా వేలి ముద్రలు కావు. ఎందుకంటే అప్పుడు నా చేతులకు గ్లౌజులున్నాయి "
లాయర్ గారు అయోమయంగా చూశాడు నేరస్థుడి వైపు.
" ఈ హత్య నేను చేయలేదు సార్ ! " చెప్పాడు నేరస్థుడు
"అయితే పిస్తోల్ పైన నీ వేలి ముద్రలు ఉన్నాయంటున్నారు"
"వాళ్ళు చెప్పేది పచ్చి అబద్దం! అవి నా వేలి ముద్రలు కావు. ఎందుకంటే అప్పుడు నా చేతులకు గ్లౌజులున్నాయి "
లాయర్ గారు అయోమయంగా చూశాడు నేరస్థుడి వైపు.
Subscribe to:
Posts (Atom)