Tuesday, 29 September 2015
Sunday, 27 September 2015
Saturday, 26 September 2015
వీధి కుక్కల బెడద !
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ వున్న నగర శివారు ప్రాంతాలలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ప్రదానంగా కాలనీలలో వీధి కుక్కల సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా గుంపులుగా సంచరిస్తూ, వింత అరుపులతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి కాటుకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతి రోజు ఏదొక చోట కుక్క కాటుకు గురయిన వార్తలే వినిపిస్తున్నాయి. అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కుక్కల నియంత్రన కోసం చర్యలు తీసుకున్నట్టు కనబడటం లేదు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కుక్కల నియంత్రణకు తగు చర్యలు చేపడితే బాగుంటుంది.
Monday, 21 September 2015
Saturday, 19 September 2015
Thursday, 17 September 2015
ఓల్డ్ ఈజ్ గోల్డ్ !
గతంలో పెళ్లిళ్లు కొబ్బరాకు, నేరేడాకులు, మామిడాకులు పందిరి కింద మనోహరంగా జరిగేవి. అతిధులు పచ్చని ఆకులు సువాసనలను ఆస్వాదిస్తూ...చక్కటి అనుభూతిని పొందేవారు. ఇప్పుడు వాటి స్థానాన్ని షామియానాలు ఆక్రమించుకోవడంతో అ అనుభూతిని కోల్పోతున్నాం. పెళ్లి భోజనం కుడా అరిటాకుల్లో సాంప్రదాయకరమైన వంటల్ని ఆరగించేవారు. ఇప్పుడు వాటి స్థానంలో ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ ఇస్తరాకులు, బఫే పేరిట ఆరోగ్యాన్ని పాడుచేసే రకరకాల వంటకాలు.... అందుకేనేమో 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అన్నారు పెద్దలు.
Wednesday, 16 September 2015
Monday, 14 September 2015
చిన్న విగ్రహాలను ప్రతిష్టించు ...పర్యావరణాన్ని కాపాడు !
వినాయకుడిని పూజించడానికి పెద్ద విగ్రహాలు ప్రతిష్టించాల్సిన అవసరం లేదు. విగ్రహం ముప్పయ్ అంగుళాలు ఉంటే చాలు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రంగులు వాడని చిన్న మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తే బాగుంటుంది. గణేష్ విగ్రహాలు పోటిపడి భారీ స్థాయిలో ప్రతిష్టించి, మైకులు, డి.టి.ఎస్ సౌండ్లతో చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించగుండా తగుజాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిది. మండపాన్ని అలంకరించే సీరియో బల్బులు, ఫ్లడ్ లైట్స్ చూడటానికి అందంగా కనిపిస్తాయి. కాని, వాటికి ఉపయోగించే కరెంటు మాత్రం పబ్లిక్ గా విద్యుత్ చౌర్యం చేయకుండా విద్యుత్ అధికారులను సంప్రదించి, తగిన పైకం చెల్లించి విద్యుత్ ను వాడుకుంటే బాగుంటుంది. విద్యుత్ అధికారులు సూచించిన నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి. ఇంట్లో ప్రతిష్టించే వినాయక విగ్రహాలను రసాయనాలను ఉపయోగించనివిగా, సాధ్యమైనంతవరకు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి. మట్టి విగ్రహాలను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించితే చూడముచ్చటగా ఉంటాయి. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రంగులు ఉపయోగించని విగ్రహాలను ప్రతిష్టించి జలాశయాలను కలుషితం కాకుండా, అందులోని జల పుష్పాలకు హాని కలుగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.
Sunday, 13 September 2015
మన తెలుగు టీవీ ఛానల్స్ !
ఈ మధ్య వస్తున్న టీవీ సీరియల్స్ చూస్తుంటే...అసలు మనుషుల మధ్య సత్సంబంధాలు, కుటుంబసభ్యుల మధ్య అభిమానాలు ఉండావా ? ప్రపంచమంతా మెచ్చుకునే మన కుటుంబ వ్యవస్థ విలువలేమయ్యాయి ? అనే సందేహం కలగకమానదు. ఎందుకంటే మన తెలుగు టీవీ సీరియల్స్ లో మగాడికి రెండు పెళ్లిళ్లు, వివాహేతర సంబంధాలు, అత్తాకోడళ్ళు, తోడికోడళ్ళ మధ్య పోరు, పగలు, ప్రతీకారాలు. డానికి తోడు కుట్రలు కుతంత్రాలు...మంత్రం తంత్రాలు.
చిన్న పిల్లల చేత పిచ్చి డ్యాన్స్ లు, అసభ్యకరమైన దుస్తులు వేయించడం. హాస్య కార్యక్రమం పేరుతొ మగవాళ్ళు ఆడవేషాలు వేస్తూ, ద్వంద అర్థాలతో కూడిన డైలాగులతో హాస్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఒకరునొకరు కొట్టుకోవడం, జడ్జీలు విరగపడి నవ్వడం... ఇవ్వన్నీ చూస్తుంటే మనకు పిచ్చి ఎక్కడం ఖాయం.
Friday, 11 September 2015
గణేష్ ఉత్సవాల సందడి !
వినాయకచవితికి చందాలు వాసులు చేసే కార్యక్రమం మొదలయింది. నిర్వహకులు పెద్ద విగ్రహాలను ప్రతిష్టించాలని చూస్తున్నారు తప్ప, తర్వాత ఏర్పడే పర్యావరణ కాలుష్యాన్ని గురించి ఆలోచించడం లేదు. వినాయకుని విగ్రహాలు ప్రతిష్టించే వారు ఎత్తు తక్కువున్న మట్టి గణనాథులను ప్రతిష్టిస్తే, పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు చేతి వృత్తుల వారికి సహకారం అందించిన వారవుతారు. కొందరు వెకిలితనంతో వినాయకుడు ఫిడేల్ వాయుస్తున్నట్టుగా, మద్దెల మోగిస్తున్నట్టుగా, మోటారుసైకిల్ మీద వెడుతున్నట్టుగా ఎవరి వంకర బుర్రకు ఏ ఆలోచన తడితే ఆ తీరుగా వినాయకుడుని తయారుచేస్తూ మహా అపచారం చేస్తున్నారు. ఈ విపరీత ధోరణి మారాలి. గణనాథుడు ఎలా ఉంటాడో అలా తయారు చేసిన వినాయకుడుని ప్రతిష్టించి, భక్తిశ్రద్దలతో పూజించి మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడండీ. పండుగలు, ఉత్సవాలు సమాజహితాన్ని కోరాలి. గణేష్ నవరాత్రులు పూర్తిగా భక్తీ ప్రధానంగా, సమాజహితంగా నిర్వహించబడాలి. మట్టి విగ్రహాలను ప్రతిష్టించి, శబ్ధ కాలుష్యాన్ని నివారించి, పర్యావరణానికి హాని కలుగకుండా చూడాల్సిన బాధ్యత మనపైన ఉందని మరచిపోకూడదు.
Thursday, 10 September 2015
Tuesday, 8 September 2015
Saturday, 5 September 2015
Friday, 4 September 2015
గురుదేవులకు వందనాలు !
అక్షరజ్యోతుల్ని వెలిగించి ...
విజ్ఞానాన్ని అందిస్తూ ...
క్రమశిక్షణ నేర్పిస్తూ ...
విద్యార్థుల లక్షసాధనకు
పునాది వేసేవారు
విద్యార్థి వ్యక్తిత్వం, ప్రవర్తనపై
బలమైన ముద్రవేసేవారు
గురువులు !
విద్యార్థులలో స్పూర్తిని నింపి
విజయం వైపు నడిపిస్తూ ...
తమలో దాగివున్న
గొప్ప విషయాలను బోధిస్తూ ...
భావితరాలను తీర్చిదిద్దుతున్న
గురుదేవులకు వందనాలు !!
Wednesday, 2 September 2015
మంచి మనసుకు స్వాగతం !
నెమలి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కాని అది గొంతు విప్పితే కర్ణ కఠోరంగా ఉంటుంది.
ఏమాత్రం అందంలేని నల్లని కోకిల గొంతు ఎంతో శ్రావ్యంగా...మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
మనిషి కుడా అంతే! చాలా తెల్లగా అందంగా ఉండవచ్చు. కాని మనసు నిర్మలంగా, స్వచ్ఛంగా ఉన్నప్పుడే ఆ అందం మంచు కడిగిన మల్లెపువ్వులా ఉంటుంది.
Tuesday, 1 September 2015
టీవీ సీరియల్స్ బాధితుడు ! (జోక్ )
సంవత్సరాల తరబడి పాకంలా సాగుతున్న తెలుగు టీవీ సీరియల్స్ మాయలోపడి భర్తను, పిల్లలను పట్టించుకోని ఓ మహిళ భర్త విసిగిపోయి ఓ స్వామీజీని కలిశాడు.
మహిళ భర్త : " నాభార్యకి టీవీ సీరియల్స్ పిచ్చి మాన్పించే ఉపాయం ఉంటే చెప్పండి స్వామీ " స్వామీజీ : " ఆ ఉపాయమే తెలిస్తే నేను ఈ సన్యాసిగా ఎందుకు మారతాను శిష్యా "
మహిళ భర్త : " అంటే.. మీరు కూడా నాలాగే ..."
స్వామీజీ : అవును నాయన... నేను కుడా నీలాగే తెలుగు టీవీ సేరియల్స్ బాధితుడినే!
Subscribe to:
Posts (Atom)