”శోధిని”

Saturday, 26 January 2013

సౌందర్య సొంపు!

Photo: Hi


గ్రీష్మంలో విరిసే 
మల్లెల పరిమళంలా...
పున్నమి రేయి కురిసే 
వెన్నెల జల్లులా...
తామర పైన నర్తించే 
తుషార బిందువులా...
ఆకాశంలో కనువిందు చేసే 
హరివిల్లులా...
చూడకనుల కింపు 
నీ సౌందర్య సొంపు!



Friday, 25 January 2013

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!


జనవరి  8, 2013 భారత్-పాక్ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న మన సైనికులు శ్రీ హేమరాజ్, శ్రీ సుధాకర్ సింగ్ లు శత్రువుల తూటాలకు  వీర మరణం పోందారు.శత్రుమూకల కుసంస్కార  తీరుకు తలలులేని మొండాలతో నేలకొరిగారు.  ఈ దుశ్చర్యను ప్రతి ఒక్కరు ఖండించాలి.  మన కోసం ప్రాణాలర్పించిన ఈ వీరులకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా వందనాలు సమర్పించుకుందాం. వీరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తాం!
                భారత్ మాతాకీ  జై! 



Friday, 4 January 2013

ప్రేమ వర్షం...!














అనుబంధం పెంచిన ప్రియతమా...
అనురాగం పంచిన నా ప్రాణమా...
కురిసే మంచులో విరిసే పువ్వులా ...
నీ ప్రేమ కుసుమాలు...
పరిమళాలను వెదజల్లుతుంటే...
నిత్యం నీ ప్రేమ వర్షంలో... 
తడిసి ముద్దవుతున్నా!