శీతాకాలం చివరి దశలోనూ చలి జనాన్ని బెంబేలెత్తిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లోఇంటి నుండి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. సంక్రాంతి వెళ్లిపోతున్నా మునుపెన్నడూ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఈ చలి పులి వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపించడంతో వృద్దులు, పిల్లలు సతమతమవుతున్నారు. చలికి ఫ్లూ వైరస్ తోడవడంతో అనేక రకాల శ్వాశకోశ వ్యాధులు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి.కొత్తగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదం కావడంతో ప్రజలు హడలి పోతున్నారు. ఈ మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి.
No comments:
Post a Comment