Monday, 14 August 2017

"స్వాతంత్ర్యయోధుల త్యాగఫలం ...సర్వజనులకిది పర్వదినం"

స్వాతంత్ర్య దినోత్సవం అనగానే మనకి గుర్తుకొచ్చేది స్వాతంత్ర్య సమరయోధులు. అహింసాయుత మార్గంలో ఎందరో మహానుభావులు మన దేశానికి స్వేచ్చను అందించారు. జాతి, కులం,మతం, ప్రాంతం అనే తేడాలనేవి లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాలతో జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవ పర్వదినం....స్వాతంత్ర్యవీరుల త్యాగఫలం. ఆగస్టు 15 మన దేశ చరిత్రలో మరచిపోలేని ఒక అపురూపమైన రోజు. తెల్లదొరల నిరంకుశ పాలనకు తెరపడి, మన దేశానికి విముక్తి లభించిన రోజు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం సాదించడానికి కృషిచేసిన త్యాగమూర్తులను గుర్తుచేసుకుందాం... వారిని మన హృదయంలో నిలుపుకొని వందనం అర్పిస్తాం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !

Sunday, 6 August 2017

పోతుకూచి సాంబశివరావుగారు ఇకలేరు.

బహుముఖ ప్రజ్ఞాశాలి, సుప్రసిద్ధ సాహితీవేత్త మా గురువుగారు డాక్టర్ పోతుకూచి సాంబశివరావు గారి మరణం సాహితీలోకానికి తీరనిలోటు. గత పాతిక సంవత్సరాలుగా ఆయనతో నాకు అనుబంధం ఉంది. 'విశ్వసాహితి' పక్షపత్రికలో నా రచనలు ప్రచురించి ప్రోత్సహించిన మహానుభావుడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటూ...

Saturday, 5 August 2017

"స్నేహబంధం ...ఎంతో మధురం"


అనుబంధం, ఆత్మీయతల కలబోత మన స్నేహబంధం. ఎలాంటి కల్మషం లేని పసిపాప మనసు లాంటి మన స్నేహబంధం నిత్యనూతనం. మధురమైన మచ్చలేని మన స్నేహబంధం నిత్యం వికసించాలి, పరిమళించాలి. అలసిన హృదయాలకు స్వాంతన చేకూర్చి, మన మైత్రీ బంధానికీ మనమే రక్షణ కవచంలా నిలవాలి.


Thursday, 3 August 2017

"సౌభాగ్యప్రదం...వరలక్ష్మీవ్రతం"

మహిళలకు అత్యంత ముఖ్యమైనది... ప్రీతికరమైనది శ్రావణమాసం. అంతేకాదు మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం కూడానూ.  అందుకే ఈ మాసమంతా మహిళలలో భక్తిభావం పొంగి పొర్లుతుంది.  ఏ ఇంటిలో చూసినా వ్రతాలు, నోములతో ఆధ్యాత్మక భావం కనపడుతుంది. కుటుంబసభ్యుల సంక్షేమం కోసం వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు.  సృష్టి, స్థితి లయకారిణి అయిన  అమ్మవారు అనంత శక్తి స్వరూపిని.  ఈ ప్రపంచమంతా సర్వం తానై  ఇమిడి ఉంది.  అమ్మ కరుణఉంటేచాలు కష్టాలు, దుఃఖాలు అన్నీ క్షణంలో మటుమాయమైపోతాయి. సకల శుభాలనిచ్చే శ్రీ మహాలక్ష్మి శ్రావణమాసములో వరలక్ష్మిగా పూజలందుకుంటుంది.  వరలక్ష్మిదేవిని భక్తితో పూజించి,  నిష్టగా, నైవేద్యాలు సమర్పించిన  వారింట అమ్మవారు కొలువై ఉంటుండని భక్తుల విశ్వాసం. 

 

Saturday, 22 July 2017

ప్రమాదంలో దేశ యువత

క్షణికానందం కోసం ఎందరో యువతీయువకులు తమ నిండు జీవితాల్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. మాదక పదార్థాలకు బానిసలైన వారి జీవితాలు చీకటి బతుకులేనని గ్రహించాలి. దేశంలో పాతుకుపోయిన డ్రగ్స్ మాఫియాను సమూలంగా నాశనం చేయడానికి ప్రభుత్వానికి సహకరించినప్పుడే యువత భవిష్యత్తును కాపాడినవారవుతారు.  విద్యార్థులు మత్తు వైపు కాకుండా లక్ష్యం వైపు అడుగులు వేయాలి.Thursday, 13 July 2017

"చెట్టు... జీవకోటికి ఆయువు పట్టు"సర్వ జీవకోటికి ఆయువుపట్టు అయిన  చెట్లను నరకడం ఆపి, మొక్కలను నాటడం అలవాటు చేసుకోవాలి. పరిసరాలన్నింటిని పచ్చని చెట్లు నాటితే, భూమాత చల్లగా ఉంటుంది.  నాటిన చెట్లను సంరక్షిస్తే,  కోట్ల వృక్షాలు పుట్టుకొస్తాయి.  దీంతో వర్షాలు పుష్కలంగా కురుస్తాయి.     పచ్చదనం మీదే ప్రపంచం ఆధారపడివుందన్న విషయం మరవద్దు.  పచ్చదనం అంటే హడాహుడిగా మొక్కలను నాటి,  ఆ తర్వాత వాటి సంరక్షణను మరచిపోవడం కాదు.  మొక్కలను నాటడంపై ఉన్న శ్రద్ధ పోషణలో కనిపించాలి.