”శోధిని”

Tuesday, 22 May 2012

"నాయకుల చెలగాటం...ప్రజలకు ఇరకాటం"




        కొందరి స్వార్థపూరిత ఆలోచనలవల్ల తరుచూ ఉపఎన్నికలు రావడంతో ప్రజాధనం ఎంతో వృధా అవుతోంది.  నాయకుల స్వార్థం కోసం రాజీనామా చేస్తే, నష్టాన్ని ప్రజలు భరించక తప్పడం లేదు.  ఇప్పుడు జరగపోయే ఉప ఎన్నికల ఖర్చు కోట్ల రూపాయలు అవుతుందని అంచనా. ఫలితంగా రాష్ట్రంలో ప్రతి వస్తువు ధరలు విపరీతంగా పెరుగుతాయి.   ఎన్నికలవల్ల తీవ్రంగా నష్టపోయేది మాత్రం ప్రజానీకం.  ఇంతకుముందు  ప్రజాపతినిధి మరణిస్తేనో లేక పార్టి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తేనో ఉపఎన్నికలు జరిగేవి.  కానీ, ఇప్పుడు వాటికిభిన్నంగా  ప్రభుత్వాన్ని బెదిరించదానికో లేక ఎమ్మెల్యేలు అమ్ముడుపోవడం వల్లనో  ఉపఎన్నికలు రావడం దురదృష్టకరం.  ఇలా తరుచూ ఎన్నికలు రాకుండా ఉండాలంటే, రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు సిద్దపడే నాయకుల దగ్గరే ఎన్నికలకు అయ్యే ఖర్చు రాబట్టాలి.   ఇలా చేస్తే మన ప్రజాప్రతినిధులు ఐదేండ్లు జాగ్రత్తగా వుంటారు. అయినదానికీ, కానిదానికి ఎన్నికలు తెచ్చే ఎమ్మెల్యేలను (ఏ  పార్టీ  వారయినా) చిత్తుగా ఓడించాలి.  ప్రజలంటే ఏమిటో రుచి చూపాలి.

5 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

yes, I agree This!

జలతారు వెన్నెల said...

చిత్రం బాగుందండి! ప్రజలు అలోచించి వోట్స్ వేస్తారంటారా? వేస్తే మంచిదే!

కాయల నాగేంద్ర said...

థ్యాంక్స్!

కాయల నాగేంద్ర said...

ప్రజలు ఆలోచిస్తేనే నాయకులలో మార్పు వస్తుందండీ!

Unknown said...

కాయల నాగేంద్ర గారికి,

చాలా బాగా రాసేరండి. కానీ ఆలాంటి చట్టాన్ని తీసుకురావలసింది ఈ రాజకీయ నాయకులే కదా...వాళ్ళు తీసుకువస్తారా?

మీకొసం