భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేకస్థానం ఉంది. హిందువులు తులసిని పరమ పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు ఆరోగ్యప్రదాయని.... చక్కని ఔషదం కూడా. అది ఎన్నోమొండి రోగాలను నయం చేస్తుంది. రోజూ కొన్ని ఆకులు నమిలి మింగితే వ్యాధుల దరిచేరవంటారు. మనవ శరీరంలో శ్లేష్మం పెరిగి శ్వాస ఆడక ప్రాణం పోతుంటే, తులసి తీర్థం తగిలి శ్లేష్మం విరిగి మనిషి బ్రతికిన సందర్భాలున్నాయి. అందుకే మనిషి తుదిశ్వాస విడిచేటప్పుడు తులసి తీర్థం గొంతులో పోస్తారు. ఇంత పవిత్రమైనది కాబట్టి దేవాలయాలలో భగవంతుని తీర్థంగా భక్తులు స్వీకరిస్తారు.
Wednesday, 29 June 2016
పవిత్రమైన తులసి !

Wednesday, 22 June 2016
Saturday, 18 June 2016
Friday, 17 June 2016
మానవత్వం !
ఉన్నతమైన వ్యక్తిత్వం, సేవాగుణం వల్లనే మనిషికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎదుటి వ్యక్తి నుంచి గౌరవం పొందాలనుకునేవారు ముందుగా తామే ఎదుటివారిని గౌరవించడం నేర్చుకోవాలి. మల్లెపువ్వు సువాసన అందర్ని అలరించినట్టు, మానవత్వం కారణంగానే మనిషి అందరి మనస్సుల్లో నిలిచి ఉంటాడు. మనిషి మనుగడ సవ్యంగా సాగాలంటే, నీతి నిజాయితీ తప్పకుండా పాటించాలి. మనిషి ఎంత ఎత్తు ఎదిగినా వినయం, విధేయత, నీతి నిజాయితీలను వీడరాదు. నియమ, నిబద్దలతో జీవిస్తే మనిషిజన్మ ధన్యమవుతుంది.
Sunday, 12 June 2016
Thursday, 9 June 2016
Tuesday, 7 June 2016
" మహనీయుడు "
బాటసార్లుకు చల్లదనం కోసం, స్వచ్చమైన గాలి కోసం రోడ్లకు ఇరువైపుల అశోకుడు చెట్లను నాటించాడు. భూగర్భ జలాలను పెంచేందుకు, పంటలు పండించేందుకు ప్రతి గ్రామానికి చెరువులు, మంచినీటి కోసం బావులు తవ్వించాడు. ప్రకృతి రమణీయత, పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేశాడు. ఆయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదని, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లేవారని చరిత్ర చెబుతోంది. ఆయన చేసిన సేవలు మరువలేనివి. అందుకే ఆయన మహనీయుడు. కేవలం ప్రచారం, ప్రసంసల కోసం కాకుండా అశోకుడిలా మన నాయకులు కూడా ప్రజల కోసం నిజమైన సేవ చేస్తే ఎంత బాగుండును.
Saturday, 4 June 2016
ప్రకృతిని కాపాడుకుందాం !
కొందరు ఆధునిక అవసరాల పేరుతో కొండల్ని కొట్టేస్తూ, భూమిని తవ్వేస్తూ ఇష్టం వచ్చినట్లు ప్రకృతిని పిండేస్తున్నారు. మరికొందరు ధన సంపాదనకోసం నదులను తవ్వేస్తూ..అడవులను అంతం చేస్తూ అత్యంత దయనీయంగా, క్రూరంగా పెనువిద్వంసం సృష్టిస్తున్నారు. ఇంకొందరు నిర్ధాక్షణంగా చెట్లను నరికేస్తూ, వ్యర్ధాలను నలువైపులా వెదజల్లుతూ, భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నారు. ఇలా సహజవనరులను హరించేస్తూ, జంతువులను, పక్షులను నాశనం చేస్తూ ప్రకృతి వినాశనానికి ఇదొక విధంగా కారణమవుతున్నారు. ఫలితంగా తుఫానులు, భూకంపాలు! మన కళ్ళను మనేమే పొడుచుకుంటూ... మన గోతుల్ని మనమే తవ్వుకుంటున్నాం. ప్రకృతి అందానికి ప్రతీకగా ఉండే ప్రాంతాలు రెక్కలు తెగిన పక్షుల్ల విలవిలాడుతున్నాయి. పుడమితల్లి ఆవేదనను అర్థంచేసుకుందాం... భూమిని భూమిలా ఉండనిద్దాం... చెట్లను చెట్లగా బ్రతకనిద్దాం... నదులను నదులుగానే పారనిద్దాం ... మన ప్రకృతిని మనం కాపాడుకుందాం !