Saturday, 18 May 2013

బాబోయ్ ...కొబ్బరి బొండాంలు!



సహజసిద్ధ మైన, స్వచ్చమైన లవణాలు, విటమిన్లతో  నిండిన అమృతపానీయం  కొబ్బరి నీళ్ళు.  వయసురీత్యా వచ్చే ఉగ్మతలను ఈ కొబ్బరి నీళ్ళు నివారించగలవు.  అందుకే ఈ కొబ్బరి చెట్టును 'కల్ప వృక్షం' అన్నారు మన పెద్దలు. కొబ్బరి నీళ్ళు దాహాన్ని తీర్చే గుణంతో పాటు శరీరాన్ని చల్లపరచే గుణం వుంది.  అయితే వీటి ధర మాత్రం కొండెక్కి కూర్చుంది.  వ్యాపారస్తులు అయిదు రూపాయలకు రైతుల దగ్గర కొని, మనకు ఇరవయి రూపాయలకు అమ్ముతున్నారు. ఫలితంగా అటు   కష్టపడి పండించిన రైతులు ... ఇటు ఇరవయి రూపాయలకు కొన్న ప్రజలు నష్టపోతున్నారు. వ్యాపారస్తులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు.  


1 comment:

  1. 1000+ayurveda etc free ebooks
    www.granthanidhi.com

    http://mohanpublications.com/ayurveda_ebooks1.php

    ReplyDelete