ఉపాద్యాయ వృత్తి ఏంతో గౌరప్రదమైనది. తల్లిదండ్రుల తర్వాత మనిషి వ్యక్తిత్వ వికాసంలో అద్యాపకులదే కీలక పాత్ర.. అంతేకాకుండా సమాజంలోని ప్రతి రంగంలోనూ ఉపాధ్యాయుని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. తనను తాను సంస్కరించుకుంటూ సమాజాన్ని సంస్కరించాలి కాబట్టి, ఏ మాత్రం నిర్లక్షంగా వ్యవహరించినా... ఒక తరం తీవ్రంగా నష్టపోతుంది. అందుకే పిల్లలకు పాఠాలు చెప్పే గురువులు భాద్యతగా వ్యవహరించాలి. విద్యార్థులలో ఆసక్తిని రేకెత్తించే స్థాయిలో భోదనలు చేయాలి. విధినిర్వహణలో నిబద్దత, క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించాలి.పాఠ్యంశాలలోని మాధుర్యాన్ని విద్యార్థులకు చవి చూపించాలి. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నాడంటే అందులో ముఖ్యపాత్ర అద్యాపకులదే. విద్యార్థులకు వినయ విధేయతలతోపాటు విద్యాబుద్దులు నేర్పి వారి భవిష్యత్తుకి బాటలు వేసేది ఉపాద్యాయులే. దేశం ప్రగతి పథంలో నిలబడాలంటే విద్యార్థులకు మంచి విద్యనందించే అధ్యాపకులు నేడు ఎంతో అవసరం. విద్యార్థులు కుడా గురువులను గౌరవించినప్పుడే వారి ఆశయం నెరవేరుతుంది.
good one
ReplyDeleteThank you Palla Kondala Rao Gaaru!
ReplyDelete