
కళా ప్రపూర్ణ , చిత్రబ్రహ్మ శ్రీ బాపు గారి దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ప్రతిష్టాత్మక చిత్రం 'శ్రీ రామరాజ్యం' పండిత పామరుల ప్రశంసలు అందుకుంది. నేటితరం, రేపటితరం వారు కూడా ఎప్పటికి గుర్తుంచుకునేలా అత్యంత సుందరంగా బాపు, రమణలు ఈచిత్రాన్నితెరకెక్కించారు. ఈ అపురూప దృశ్యకావ్యాన్ని ఈ నెల 20 వ తేదీన సాయంత్రం 7 గంటలకు ‘జీతెలుగు’ ఛానల్ వారు ప్రసారం చేస్తున్నారు. కమనీయ, రమణీయమైన ఈ చిత్రాన్ని కుటుంబసభ్యులతో కలసి మన ఇంట్లోనే తిలకించవచ్చు. భార్యాభర్తల ప్రేమానురాగాలు, అన్నాదమ్ముల అనుబందాలు, కుటుంబసభ్యుల ఆప్యాయతలు నేటితరం పిల్లలకు తెలియాలంటే తప్పకుండా ఈ చిత్రాన్ని చూపించాలి.
నేటితరం, రేపటితరం వారు కూడా ఎప్పటికి గుర్తుంచుకునే సినిమా లవకుశ అని నా అభిప్రాయం. అది కూడా త్వరలో ‘జీతెలుగు’ ఛానల్ వారు ప్రసారం చేయబోతున్నారు. 'శ్రీరామరాజ్యం' సరే 'లవకుశ' కూడా చూసాక ఆలోచించండి.
ReplyDeleteశ్యామలీయం గారు, మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. 'శ్రీ రామరాజ్యం' చిత్రాలు ఎన్ని వచ్చినా 'లవకుశ'కు పోటీ ఇవ్వలేవు. 'లవకుశ' లాంటి గొప్ప చిత్రంతో 'శ్రీరామరాజ్యం' చిత్రాన్నినేను పోల్చలేదు. నేటితరం, రేపటితరం వాళ్ళకి 'లవకుశ' సినిమాలోని పద్యాలు, తెలుగు భాషలోని కఠిన పదాలు అర్థం కావు. శ్రీ రామరాజ్యం చిత్రంలో నేటితరానికి అర్థమయ్యేలా తెలుగు భాష సరళంగా ఉంది. అందుకే ఈతరం, రేపటితరం అన్నాను. 'లవకుశ' చిత్రాన్ని పదిసార్లు చూసాను. ఎన్నిసార్లు చూసినా తనివితీరదు.
ReplyDelete౬౦వ దశకంలో ఇప్పటికంటే అక్షరాస్యత తక్కువ. అప్పట్లో పరమనిరక్షరాస్యులనూ అద్భుతంగా అలరించిన లవకుశ నేటితరం, రేపటితరం వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? చక్కగా అర్థమౌతుంది. సాంకేతికంగా లవకుశ నాటికంటే ఎంతో అభివృధ్ధిని సాధించింది సినిమా. అటువంటప్పుడు శ్రీరామరాజ్యం వంటి నాసిరకం సినిమాను తీయటంలో అర్థం లేదు. పైగా దానికి బోలెడంత ప్రచారం! శ్రీ రామరాజ్యం చిత్రంలో నేటితరానికి అర్థమయ్యేలా తెలుగు భాష సరళంగా ఉందన్న మాటలో కొంత నిజం ఉండ వచ్చును - అలాగనుకుంటే రాబోయేరోజుల్లో మరింత సరళం కావచ్చును. అప్పటి తరానికి విల్లంబులు తెలియవు కాబట్టి రాముడు జీన్స్ పాంట్ వేసుకుని AK56 ఎక్కుపెడతాడేమో - కాలానుగుణంగా! ఇలా ప్రమాణాలు దిగజార్చుకుంటూ పోతే మన భాషాసంస్కృతులే కాదు, మనమే మిగలం.
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteనాగేంద్ర గారు, ఈ సినిమా చూడలేదు నేను. వీలైతే DVD దొరికితే చూడాలి. పాటలు నాగేంద్ర గారు, ఈ సినిమా చూడలేదు నేను. వీలైతే ద్వ్ద్ లాంటిది దొరికితే చూడాలి. పాటలు బాగున్నాయి వినటానికి.
ReplyDeleteTappakundaa gurtu pettukuni choosthaanu. Thank you Nagendra gaaru.
ReplyDelete