Saturday 1 October 2022

గాంధీ జయంతి శుభాకాంక్షలు!

సత్యమే ఆయుధంగా ..

ధర్మమే ఊపిరిగా ...

అహింసయే ఆయుధంగా...

మనుగడ సాధించిన మహాత్మా...
 
కడలికన్న మిన్న నీ ఆత్మ!


Friday 12 August 2022

రక్షాబంధనం. .


అన్నా చెల్లెళ్ల, అక్క తమ్ముళ్ళ ఆత్మీయతను, అనుబంధాలను ప్రతిబింబించేది పవిత్ర రక్షాబంధనం.  తోబుట్టువుల అపూర్వమైన అనురాగానికి అనుబంధానికీ ప్రతీక రాఖీ పండుగ.  స్త్రీల పట్ల సోదరభావం, పవిత్రభావం ప్రతి ఒక్కరిలో కలగాలి. సమాజంలో తనకు పూర్తి రక్షణ ఉందన్న నమ్మకం ప్రతి మహిళలో కలిగించాలి.

Wednesday 13 July 2022

గురు పౌర్ణమి శుభాకాంక్షలు!


ఉపాధ్యాయ వృత్తి ఏంతో గౌరప్రదమైనది. తల్లిదండ్రుల తర్వాత మనిషి వ్యక్తిత్వ వికాసంలో అధ్యాపకులదే కీలక పాత్ర. విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకున్నారంటే అందులో ముఖ్యపాత్ర ఉపాధ్యాయులదే. విద్యార్థులు కుడా గురువులను గౌరవించినప్పుడే వారి ఆశయం నెరవేరుతుంది. విద్యను ప్రసాదించే గురువుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండటం శిష్యుల కర్తవ్యం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువులు పరబ్రహ్మ స్వరూపులు. అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానమును ఇచ్చేవారు గురువులు కాబట్టి వారిని దైవంగా భావించాలి. ఆధ్యాత్మిక గురువుగా, భగవంతునిగా భక్తుల హృదయాలలో కొలువైనవున్న షిరిడీ సాయిబాబా గురు పూర్ణిమ మహాత్యాన్ని తెలియజెప్పిన సద్గురువు. గురు పౌర్ణమి సందర్భంగా దైవస్వరూపులయిన గురువులందరికీ ప్రణామములు.



సప్తగిరులు

శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుని ఏడుపడగలే తిరుమలలో కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువై ఉన్న సప్తగిరులని పురాణలు చెబుతున్నాయి. పచ్చనిలోయలు, జలపాతాలు, అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనే సప్తగిరులు.


Monday 17 January 2022

నందమూరి తారక రామారావు గారి 26వ వర్థంతి సందర్భంగా...

ఆ చిరువవ్వులో చెదరని విశ్వాసం తొంగి చూస్తుంది. గొప్ప వ్యక్తిత్వం , స్వార్థరహితమైన త్యాగం, అంతకుమించిన ఔన్నత్యం.... కోట్లాది మంది హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానటులు నందమూరి తారక రామారావు గారి 26వ వర్థంతి సందర్భంగా...