Tuesday, 30 July 2019
Tuesday, 23 July 2019
మనసున.. మనసై !
Sunday, 14 July 2019
సుగుణాల నేరేడు
మే , జూన్, జులై నెలల్లో మాత్రం దొరికే నేరేడు పండ్లు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. వగరు, తీపి కలకలిసిన ఈ పండును తినడానికి అందరూ ఇష్టపడతారు. ఈ పండులో ఉండే విటమిన్ 'ఎ ' కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్ 'సి రోగనిరోధకశక్తిగా పనిచేస్తుంది. పొటాషియం, ఐరన్, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గించి, గుండె జబ్బులను అడ్డుకుంటుంది. ఈ పండును తినడం వల్ల రక్తాన్ని శుభ్రపరచి, రక్తప్రసరణను క్రమబద్దీకరిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను బైటకు పంపుతుంది. ఈ పండ్లను తినేటప్పుడు కొద్దిగా ఉప్పు చల్లుకుని తింటే చాలా బాగుంటాయి. ఇన్ని సుగుణాలున్న నేరేడు పండ్లు తిన్న వెంటనే పాలు త్రాగకూడదంటారు. ఈ పండ్లను మధుమేహానికి ఉపయోగిస్తారని అందరికీ తెలిసిన విషయమే!
Friday, 12 July 2019
దివ్యమనోహరుడు ... శ్రీ వేంకటేశ్వరుడు !
ఆనంద నిలయంలో కొలువై ఉండి, భక్తులను తనవద్దకు రప్పించుకునే దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరుడు. కోరిన వరాలిచ్చే కోనేటి రాయని మొక్కు తీర్చుకునేందుకు రోజూ తిరుమలకు వేలసంఖ్యలో భక్తులు వెల్లువెత్తుతారు. వైకుంఠం ఎలా ఉంటుందో మనం చూడలేదు కాని, తిరుమలలో అడుగు పెట్టగానే నిజమైన వైకుంఠం మనకళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. స్వామివారిని కనులారా తిలకించి, భక్తిపారవశ్యంతో పునీతులవుతారు. తిరుమలేశుని విగ్రహం విష్ణురూపమే అయినా విభిన్న దేవతాచిహ్నాలు కలిగిన దివ్యమనోహర విగ్రహం. అంటే, ముక్కోటి దేవతలు స్వామియందే ఉన్నారని అర్థం.