Thursday, 28 February 2019
Wednesday, 20 February 2019
Sunday, 17 February 2019
భారత్ మాతాకీ జై!
ఉగ్రవాదుల దాడిలో శత్రుమూకల కుసంస్కార తీరుకు దేశ రక్షకులు, వీర జవానులు నేలకొరిగారు. ఈ దుశ్చర్యను ప్రతి ఒక్కరు ఖండించాలి. మన కోసం ప్రాణాలర్పించిన ఈ వీరులకు వందనాలు సమర్పించుకుందాం. వీరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తాం! వీర మరణం
పోందిన అమర జవాన్ వీరులకు, గాయపడ్డ జవానులకు జోహార్ జోహార్....
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
Wednesday, 13 February 2019
Tuesday, 12 February 2019
ఈ రోజు సూర్యభగవానుడు జన్మదినం!
త్రిమూర్తి స్వరూపుడయిన సూర్యభగవానుడు జన్మదినం రథసప్తమి. ఇతర మాసాలలో వచ్చే సప్తమి తిధుల కన్నా మాఘమాసంలో వచ్చే ఈ సప్తమి ఎంతో విశిష్టమైంది. అంతేకాదు రధసప్తమి నాడు సూర్యుడు తన రథాన్ని ఉత్తరం దిక్కుకు మళ్లించినరోజు. ఈ రోజు నుంచే సూర్యుని తీక్షత క్రమేణా పెరుగుతుంది. సమస్త ప్రాణకోటి జీవనాధారానికి, సకల జీవుల సంపూర్ణ ఆరోగ్యానికి సూర్యభగవానుడే మూలం. సూర్యుడు ఉదయం బ్రహ్మ స్వరూపముగానూ, మధ్యాహ్నం శివుడుగాను, సాయంత్రం వేళ విష్ణువుగానూ ఉంటాడని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా అందరూ కొలిచే ఏకైక దేవుడు, అందరి దైవం సూర్యభగవానుడు. అంతేకాదు, ఈ సృష్టిలోని అన్ని ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు.