ఇతరుల
గురించి తేలిగ్గా మాట్లాడటమే అహంకారానికి పరాకాష్ట. ఎదుటి వారిని గౌరవించకపోయిన
పర్వాలేదు కాని, అపహాస్యం మాత్రం చేయకూడదు. ఎక్కడ అహంకారం వుంటుందో అక్కడ స్వార్థం తప్పకుండా వుంటుంది. అహంభావులతో కలసి పనిచేయాల్సివస్తే సమస్యలు తప్పవు. అందుకే సాద్యమైనంత వరకు ఇలాంటి
వారికి దూరంగా ఉండటం మంచిది. ఎంత గొప్పవాడయినా, ఎంత పెద్ద పదవిలో వున్నా అహంకారం లేకుండా వుంటేనే సమాజంలో
గుర్తింపు వస్తుంది. అహంకారం వల్ల నష్టాలే కాని, లాభాలు ఉండవని గ్రహించాలి. మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం గొప్ప కాదు. ఎదుటివారిని విమర్శించే ముందు మన లోపాలను మనం సరిదిద్దుకోవాలి. కొందరు
అనవసరమైన అబద్దాలతో, ఏదొక
సందర్భంలో మోసపూరిత ధోరణితో ప్రవర్తిస్తుంటారు. ఇటువంటి వారికి ఎంత వీలయితే అంత
దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఒకసారి
వారి గుణం తెలిశాక మళ్ళీ వారికి సన్నిహితంగా వెళ్ళకూడదు. ఇలాంటి వాళ్ళు మన దగ్గరకి వచ్చినప్పుడు, మనల్ని ఆకాశానికి
ఎత్తేస్తూ... పక్కవాళ్ళ గురించి చెడుగా చెప్పడం, పక్కవాళ్ళ దగ్గరకి వెళ్ళినప్పుడు మన గురించి చెడుగా చెబుతూ
వాళ్ళను ఆకాశానికి ఎత్తేయడం అలవాటు. ఇలా
తన చుట్టూ ఉన్న వాళ్లల్లో
విరోధం పెంచుతూ, తను మాత్రం అందరి దగ్గర మంచివాడుగా చెలామణి అవుతూ నక్కలా
లబ్ధి పొందుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు విష సర్పాల కంటే ప్రమాదం కాబట్టి, మన జాగ్రతలో మనం ఉండటం చాలా మంచిది.
well said dear friend
ReplyDeleteThank you Sir
Delete