Wednesday 25 January 2012

63 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!




       మనందరం  గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన రోజు గణతంత్ర దినోత్సవం.  కుల-మత, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే జాతీయ పండుగ. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం పరిపాలించేందుకు 1950 జనవరి, 26 రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం.  మన రాజ్యాంగాన్ని తయారుచేయడానికి ఎంతో మంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి రూపొందించారు.   

       ఎందరో మహానుభావుల త్యాగఫలం వలన మనకు గణతంత్ర రాజ్యం ఏర్పడింది. మన దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు మన పరిపాలనా విధానం బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది.  మన రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా గణతంత్ర  దినోత్సవం జరిగింది.   రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది.      

      గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం.  కానీ, అర్థం కాస్త రాజకీయనాయకులే ప్రభుత్వం,  ప్రభుత్వమే రాజకీయనాయకులుగా మారిపోయింది. అంతా రాజకీయ మహిమ.  63 గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనదేశానికి తమ జీవితాన్ని అర్పించిన ఎందరో వీరుల త్యాగఫలాన్ని స్మరించుకుందాం.