Wednesday, 12 September 2012

విద్యుత్ ను పొదుపు చేద్దాం!


ఒక యూనిట్ విద్యుత్ పొదుపు చేస్తే, రెండు యూనిట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేసినంత ప్రయోజనం.  ఇంట్లో ధారాళంగా వెలుతురు ప్రసరించేలా ఏర్పాటు చేసుకుంటే, పట్టపగలు లైట్లు వేసుకోవాల్సిన దుస్థితి రాదు.చలికాలం ఫ్యాన్లు తిరగాల్సిన అవసరం  ఏర్పడదు. పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తే ఏసీలు వాడాల్సిన పని ఉండదు రోజువారీ వినియోగంలో కాస్త పొదుపు పాటిస్తే బిల్లుల మోత తగ్గించుకోవచ్చు. విద్యుత్ ను పొదుపు చేయడంలో కొన్ని...
మెళకువలు.
ట్యూబ్ లైటు ఫ్లోరోసెంట్, సిఎఫ్ఎల్  బల్బుల్ వాడితే తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది.
సామర్థ్యానికి మించి వాషింగ్ మిషన్లలో దుస్తులు వేయరాదు. 
బోరింగ్ మోటార్ల వద్ద కెపాసిటర్లను అమర్చుకుంటే తక్కువ కరెంట్ ఖర్చు అవుతెంది.
తక్కువ బరువుండే ఐరన్ బాక్స్ లను  వాడాలి.
ఫ్రిజ్  తలుపును ఎక్కువ సేపు తెరచి ఉంచరాదు.  ఫ్రిజ్ లో ఐస్ ముక్కలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి.
మరికొన్ని ముఖ్య విషయాలు
ఒక ట్యూబ్ లైటు 29 గంటలు వెలిగితే ఒక యూనిట్ విద్యుత్ ఖర్చవుతుంది.                                                                
వాక్యుమ్ క్లీనర్  ఒక గంట 30 నిముషాలు పని చేస్తే ఒక యూనిట్ ఖర్చవుతుంది.        
గీజర్  30 నిముషాలు పని చేస్తే   ఒక యూనిట్ ఖర్చవుతుంది. 
మిక్సీ రెండు గంటలు వాడితే  యూనిట్ ఖర్చవుతుంది. 
ఏసీ  30 నిముషాలు పని చేస్తే   ఒక యూనిట్ ఖర్చవుతుంది. 
వాషింగ్  మెషీన్ ఒక  యూనిట్ కు 4 గంటలు పనిచేస్తుంది
ఐరన్ బాక్స్ రెండు గంటల 30 నిముషాలు పని చేస్తే ఒక యూనిట్ ఖర్చవుతుంది.        
కంప్యూటర్ పది గంటలకు ఒక యూనిట్, రిప్ర్హిజిరేటర్  ఏడు గంటలకు, టెలివిజన్ ఎనిమిది గంటలకు, నీటి పంపు మూడు గంటలకు, ఒక యూనిట్ ఖర్చవుతుంది.
పై లెక్కలు దృష్టిలో పెట్టుకుని  విద్యుత్ ను పొదుపు చేద్దాం.

14 comments:

  1. తప్పకుండ నాగేంద్ర గారు ఈ కరెంటు కరువు రోజుల్లో మీ మెళకువలు ఇంకా మీ లెక్కలు చాలా అవసరం nice post

    ReplyDelete
  2. సార్ ఇంఫర్మేషన్ బాగుంది చాలా.. కానీ మహా నగరాల్లో ఆ ఇరుకు ఇరుకు ఇళ్ళల్లో వెలుతురు వస్తుందా? పచ్చదనానికి ప్రాధాన్యత అన్నది అస్సలు పట్టించుకోని అంశం మనం..చెట్లు కొట్టేసి మరీ భవనాలని నిర్మిస్తున్నాం. ఇలా ఎన్నో అంశాలు ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్నాయి కదండీ.. ఐనా సరే మీరు చెప్పిన విషయాలు మాత్రం తప్పక పాటించాల్సిందే.లేకుంటే కొన్నాళ్ళకి అది కూడా ఉండదు.

    ReplyDelete
    Replies
    1. పోస్ట్ నచ్చినందుకు థాంక్స్ సుభగారు!

      Delete
  3. చాలా విలువైన పోస్ట్ నాగేంద్ర గారు. అవగాహన పెంచేలా.. ఎంత బాగా చెప్పారు. ధన్యవాదములు.

    ReplyDelete
    Replies
    1. మీ ప్రశంసకు ధన్యవాదాలు వనజ గారు!

      Delete
  4. మీ పోస్టులు అన్నీ
    సమాజానికి ఉపయోగపడేవి..
    లేక సమాజానికి సందేశాన్నిచ్చేవిగా ఉంటాయి...
    మరొక మంచి పోస్ట్.
    అభినందనలు నాగేంద్ర గారూ!
    విద్యుత్ వాడకం మనం ఎంత వాడితే అంత బిల్లు చెల్లించగలమని
    వాడిక ఎక్కువ చేయకూడదు...
    విద్యుత్ ని పొదుపుగా వాడటం అంటే...
    విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు వాడే సహజ వనరులను సంరక్షించడం...
    @శ్రీ

    ReplyDelete
  5. నాగేంద్ర గారూ, సమాజానికి ఉపయోగ పడే పోస్ట్.
    అభినందనలు. మీరు చెప్పెవిదానం బాగుంది....మెరాజ్

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మెరాజ్ గారు!

      Delete
  6. అందరికీ ఉపయోగపడే ఫొస్ట్ నాగేంద్రగారు..Nice!

    ReplyDelete
  7. ధన్యవాదాలు వెన్నెల గారు!

    ReplyDelete