Saturday, 7 July 2012

ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న సెల్ టవర్లు




       నేడు మానవుని జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగం కావడంతో సెల్ ఫోన్ లేనిదే   క్షణం కూడా గడవని పరిస్థితి నెలకొంది. అయితే ఈ సెల్ ఫోన్ కి సిగ్నల్ అందించే సెల్ టవర్లు జనావాసాల మధ్య కొలువై ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి.  భవనాల  యజమానులు వివిధ సెల్ ఫోన్ కంపెనీ వారిచ్చే డబ్బుకు ఆశపడి  తమ భావనాల పై సెల్ టవర్లు నిర్మించుకోవడానికి  ఏళ్ళ తరబడి లీజుకు ఇస్తున్నారు.  సెల్ టవర్ల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుండటంతో ప్రజలు అనేక సమస్యలనుఎదుర్కొంటున్నారు.  ఈ సెల్ టవర్లు విడుదలచేసే రేడియేషన్ ద్వారా చర్మ వ్యాధులు, మానసిక రుగ్మతులు, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలపై అధిక ప్రభావం కలిగే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు.మరో ప్రక్క పర్యావరణ వేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు.  ఎప్పుడూ మన మధ్యనే వుంటూ మనల్ని' ఆత్మీయుల్లా 'కిచ...కిచ...'అంటూ పలకరించే పిచ్చుకలు ఈ సెల్ టవర్ల వల్ల కనుమరుగవుతున్నాయి. ఈ సెల్ టవర్ల నిర్మాణాల విషయంలో నియంత్రణ లేకపోవడంతో  ఎక్కడ  బడితే అక్కడ విచ్చల విడిగా టవర్లను నిర్మిస్తూ ... ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గృహ సముదాయాల మధ్యనే ఈ టవర్లను నిర్మించడం, నిబంధనలు పాటించక పోవడం ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్నో ప్రాణాంతక మైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటి కైన ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని , సంబంధిత అధికారులు సెల్ టవర్ల ఏర్పాటు విషయంలో కఠిన చర్యలు అవలంభించాలి.  జనావాసాలకు దూరంగా సెల్ టవర్లను ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. 

9 comments:

  1. మంచి విషయం. దృష్టికి తెచ్చారండి. మా చుట్టూ..అయిదు సేల్పోన్ టవర్స్ ఉన్నాయి.రోజు అనుకుంటూ ఉంటాను. ఇలా ఉండటం వల్ల ప్రజల ఆరోగ్యంకి చేటు అని. పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. భావన యజమానులు ఎక్కువ డబ్బు వస్తుందని..ఆశపడుతున్నారు. ఏం చేద్దాం చెప్పండి?

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు వనజ గారు!

      Delete
  2. cell phone operators aa tower radiation gurinchi
    vivaraalu teesukoni adi govt. norms ki anugunamgaa lekapote
    govt vaari meeda tappakundaa charya teesukuntundi...
    meeru upayoga karamaina vishayaanni panchu kunnaaru...
    abhinandanalu meeku...
    @sri

    ReplyDelete
    Replies
    1. మీ విశ్లేషణకి ధన్యవాదాలు శ్రీ గారు!

      Delete
  3. సెల్ లేకపోతే నాకు నిమిషం గడవదండి. కాని ఈ సెల్ టవర్స్ గురించి పెద్దగా తెలీదు. ఇప్పుడే తెలుసుకున్నను. మంచి టాపిక్స్ తీసుకుని క్లుప్తం గా రాయడం లో మీరు బెస్టు!

    ReplyDelete
    Replies
    1. ధ్యాంక్యూ...వెన్నెల గారు!

      Delete
  4. naagendra gaaroo ilaa manchi topics ennukoni vivarinchi manchi pani chasthunnaru.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు పాతిమ గారు!

      Delete