Saturday, 30 June 2012

పండ్లు తింటే...




     ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టే పండ్లు రోగాలు తెచ్చిపెడుతున్నాయంటే నమ్మశఖ్యంగా ఉండదు.  ఇది పచ్చి నిజం. ప్రకృతి సిద్దంగా పండిన పండ్లు నేడు మార్కెట్లో  కనబడడంలేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.  పండ్లు త్వరగా మగ్గడానికి వ్యాపారస్తులు తమ స్వలాభం కోసం అడ్డదారి తొక్కుతున్నారు.  పండ్లను మగ్గపెట్టడం కోసం ఇటీవల కాలంలో పలు ప్రాంతాలలో అనేక ఫ్రీజర్లు వెలసాయి.  అయితే వీటికి అనుమతులున్నాయా? అనుమతులు ఎవరు ఇచ్చారు? తెలియని పరిస్థితి.  పలు ప్రాంతాలలో కూడా ఇళ్ళలో కూడా ఈ వ్యవహారాలను చక్కబెడుతున్నారు.  పండ్లను మగ్గించడానికి రసాయనాలను ఉపయోగించడం ద్వారా ప్రజలు అనేక రోగాలకు గురవుతున్నారు. ఇలా రసాయనాలతో  మగ్గించిన పండ్లు చూడటానికి ఆకర్షణీయంగా కనిపించడంతో ప్రజలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.  డబ్బులను పెట్టి జబ్బులను కొంటున్నామని తెలుసుకోలేక పోతున్నారు.  ఇంత పబ్లిక్ గా ఈ వ్యవహారం జరుగుతున్నా పట్టించుకొనేవారు  కరువయ్యారు.  ప్రభుత్వ అధికారులు మామూళ్ళ వేటలో ... పాలకులు అధికారాన్ని ఇలా నిలబెట్టుకోవాలని ఆలోచనలో మునిగి పోయారు.  అందుకే పండ్లను కొనేముందు  బాగా పరిశీలించి కొనండి. రసాయనాలతో మగ్గించిన పండ్లను  సులభంగా గుర్తుపట్టవచ్చు. ఈ పండ్లు గట్టిగా పసుపువర్ణంతో నిగనిగలాడుతూ ఉంటాయి. ప్రకృతి సిద్దంగా పండిన పండ్లను, రసాయనాలతో మగ్గించిన పండ్ల మధ్య తేడా గుర్తిస్తే , ఆరోగ్యానిచ్చే పండ్లను తినవచ్చు.



12 comments:

  1. గుర్తించడం ఎలాగునో.. తెలిపే నాధుడు ఎవరు!?
    ప్రజల ఆరోగ్యం ఎలా ఉంటే ఏమిటి? రసాయనాల కంపెనీలు,దళారులు బాగు పడితే చాలు.
    ఇలా ఉంది పరిస్థితి. ఆరోగ్యం గురించి ఆలోచించి అనారోగ్యం రాకుండా ఉంటే చాలు..అన్నట్టు ఉంది.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది నిజమండీ!

      Delete
  2. నమ్మలేని నిజాలు....

    ReplyDelete
  3. manchi topic, maamidi pallanni ipoyaka chpparandi meeru, ee vishayam, good one, keep writing.

    ReplyDelete
    Replies
    1. ఒక్క మామిడి పండ్లే కాదు...మనం ప్రతిరోజూ తినే అరటిపండ్లను కూడా ఇలాగే మగ్గిస్తున్నారు.

      Delete
  4. నాగేంద్ర గారూ, ప్రతి చోటా దోపిడీ జరుగుతుంది, మంచి విషయం రాసారు ఇంకా కొంచం వివరంగా రాసి ఉంటె బాగుండేది, ఏది ఏమైనా చక్కని పోస్ట్

    ReplyDelete
    Replies
    1. పోస్ట్ చదివేవాళ్ళకి బోరుకొట్టకుండా విషయాన్ని క్లుప్తంగా రాయడం అలవాటు అయిందండీ!

      Delete
  5. పళ్ళను మామూలుగా ముగ్గబెట్టాలంటే ..గడ్డి, కాగితాలు ఇవన్నీ కావాలి..
    కానీ పాతిక రూపాయలతో పది టన్నులను ముగ్గబెట్టే మందు మీదే ఆధారపడుతున్నారు రైతులు...దళారులు...
    స్టాల్ లో ఉన్న అన్ని పళ్ళ రంగు(ఉదాహరణకి...మామిడి పళ్లన్నీ)
    తేడా లేకుండా ఒకేలా ఉంటే అవి calcium carbide తో పండించినవి అనుకోండి..
    అలాగే సీజన్లో కి ముందుగా పళ్ళు వస్తే కొనకూడదు...
    ఒకవేళ కొన్నా...మనం పాటించాల్సినవి
    మంచినీటితో ఒకటికి రెండు సార్లు కడిగి బట్టతో తుడిచి ఆరనివ్వాలి...
    http://www.tribuneindia.com/2006/20060528/spectrum/main1.htm
    ఈ లింక్ చూడండి...జాగ్రత్తల కోసం.
    అందరికీ ఒక హెచ్చారికలాంటి వ్యాసానికి ఈ లింక్ తోడ్పడుతుందని ఇచ్చాను...
    నాగేంద్ర గారూ!
    అందరికీ ఉపయోగ పడే విషయం పంచారు...అభినందనలు....
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మంచి కామెంట్ రాసారు శ్రీ గారు! ఇలాంటి కామెంట్స్ బ్లాగ్ పోస్ట్ లకు చాలా అవసరం. ధన్యవాదాలు!

      Delete
  6. ఆమీర్ ఖాన్ షో చూసాక బొలేడంత భయ్యం వేసింది. ఎదో పండ్లు పాలు తాగి గడిపేదామని అనుకున్నాను.
    ఇంతలో మీరు పండ్లు గురించి ఇలా...అయ్యో, ఎలాగండి ఇలా ఐతే? మంచి విషయం గురించి చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. అందుకే పండ్లు కేనేముందు చూడాలి వెన్నెల గారు!

      Delete