Monday, 4 June 2012

పర్యావరణాన్ని కాపాడుదాం ... ప్రాణకోటిని రక్షిద్దాం!



నేడు టెక్నాలజీ పేరుతో విలాసవంతమైన  జీవితం గడపడానికి అలవాటుపడి, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాం.  పరిశ్రమలు వదిలే వ్యర్ధ పదార్థాల వల్ల జలకాలుస్యం, వాహనాల వదిలే పొగ  వల్ల వాయుకాలుస్యం పెరిగిపోతోంది.  ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు అని తెలిసినా విచ్చలవిడిగా ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్నారు. దాంతో ప్లాస్టిక్ వ్యర్ధాలు భూమి పైపొరల్లో పేరుకుపోయి అనేక సమస్యలకు కారణమవుతున్నాయి.  అధిక దిగుబడులకోసం పంటపొలాలపై రసాయనక ఎరువులు,పురుగు మందులు వాడుతున్నారు.  కలప కోసం అడవుల్ని నరికి ముగజీవులకు నీడ లేకుండా చేస్తున్నారు. పచ్చదనం మీదే ప్రపంచ మనుగడ ఆధారపడివుందన్న విషయం మరువకూడదు. మనిషికొక చెట్టు నాటి, బిడ్డలా పెంచితే దేశంలో కోట్ల వృక్షాలు పుట్టుకొస్తాయి.  పచ్చని చెట్లు కాలనీల నిండా  నాటితే భూమాత చల్లగా వుంటుంది.  దాంతో వర్షాలు పుష్కలంగా కురుస్తాయి.  సర్వ జీవకోటికి ప్రాణాధారమైన చెట్లను నరకడం మాని మొక్కలను నాటడం అలవాటు చేసుకోవాలి.  పర్యావరణానికి ముప్పువాటిల్లితే అకాల వర్షాలు, పండిన పంటలను మింగేస్తాయి.  మండే ఎండలు మనల్ని మాడ్చేస్తాయి.  కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొచ్చి ప్రజల ప్రాణాలు తీస్తాయి. పర్యావరణాన్ని  పరిరక్షించాలంటే, కొండలను కొండలుగా ఉంచాలి.  నదులను నదులుగా పారనివ్వాలి.  చెట్లను చెట్లగానే బ్రతకనివ్వాలి.  స్వచ్చమైన నీరు, స్వచ్చమైన గాలి లభించిననాడే కాలుష్య రహిత సమాజం ఏర్పడుతుంది.  తద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుంది.

8 comments:

  1. ఇప్పుడిప్పుడే అవగాహన వస్తోంది..త్వరలో ఆచరణలో పెట్టగలరని ఆశిద్దాం.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు జోతిర్మయి గారు!

      Delete
  2. టపా బాగుందండి నాగేంద్ర గారు.

    ReplyDelete
    Replies
    1. థాంక్స్... వెన్నెల గారు!

      Delete
  3. సార్, పర్యావరణం గూర్చి తెలియజేయాలంటే చిన్నప్పటినుండే అలవర్చాలి , పూర్వ కాలంలో చెట్టును పూజించే విదానం ఉండేది. ఓ రకంగా అది మూడ నమ్మమం అనిపించినా దానిలో చాలా సైన్సు దాగి ఉంది. మంచి పోస్ట్ పెట్టారు

    ReplyDelete