Saturday, 9 June 2012

చెత్త సినిమాలను తీయకండి!



 సగటు ప్రేక్షకుడు సినిమా నుంచి వినోదాన్ని ఆశించి థియేటర్ కు వస్తాడు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం వారికి సినిమానే ప్రధాన వినోదం.  కానీ, నేడు సకుటుంబ  సమేతంగా వెళ్లి చూడతగ్గ సినిమాలు కోశానా కనబడటం లేదు. వినోదం పేరిట  జుగుస్సాకరంగా వుండే అశ్లీల పదాలను యదేచ్చగా వాడుతున్నారు. కుటుంబ సభ్యులతో ఇలాంటి సినిమాకి వెళితే తల దించు కోవాల్సి వస్తోంది.  అడ్డమైన అశ్లీల పదాలను సెన్సారు వాళ్ళు ఎలా అనుమతిస్తున్నారో అర్థం కావడం లేదు.  అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే కథ, సున్నితమైన హాస్యం, వినసొంపు సంగీతం, శ్రావ్యమైన సంభాషణలతో పాటు వినోదాన్ని అందిస్తూ, మంచి సందేశాన్ని ఇవ్వడమే సినిమా ప్రధాన లక్ష్యం.  కానీ, ఇప్పుడొస్తున్న చిత్రాలలో ఇవేమీ కనిపించడం లేదు.  కేవలం హీరోల అభిమానుల  కోసమే సినిమాలు తీస్తున్నట్టు అశ్లీల సన్నివేశాలు, బూతు డైలాగులు, రక్తపు మడుగులను తెర నిండా నింపుతున్నారు.  కోట్ల రూపాయలు వసూలు చేసిందని సొంత డబ్బా కొట్టుకొనే చిత్రాలన్నీనా దృష్టిలో  చెత్త సినిమాలే. ఇలాంటి సినిమాలు సమాజానికిఉపయోగపడేవి కావు.  మన తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను, తెలుగు భాషను  కనుమరుగు చేస్తున్న చిత్రాలు. హీరోలు డబ్బుకు ఆశపడకుండా మంచి చిత్రాలలో నటించడానికి పూనుకోవాలి.  అలాగే దర్శక నిర్మాతలు కేవలం డబ్బునే కాకుండా సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మిస్తే, పదికాలాలు పాటు గుర్తుండిపోతారు.


14 comments:

  1. మీరు చెప్పినది నిజం. ఈ రోఉల్లో వచ్చే సినిమాలు సభ్యతలేకుండా ఉంటున్నాయి.

    ReplyDelete
  2. తెలుగు సినిమా అంటేనే చెత్త అన్నట్టు తయారయింది పరిస్థితి.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనతో ఏకీభవిస్తున్నాను.

      Delete
  3. మీరు భలేవారండి.
    మన తెలుగు సినిమాలు ఎంత గొప్పవి కాకపోతే, హిందీ వాళ్ళు రీమేకులు చేసుకుని కోట్లు సంపాదిస్తారు?

    ReplyDelete
    Replies
    1. తెలుగు సినిమాలలో అశ్లీల దృశ్యాలు హిందీ సినిమాలను మించిపోయాయి కాబట్టి రీమేకులు చేస్తున్నారు.

      Delete
  4. నాగేన్ద్రగారూ, బాగా చెప్పారు , సినిమాలన్నీ చాలావరకు చెత్తగానే ఉన్నాయి. నా బ్లాగ్ ఫాలో అయినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు పాతిమా గారు!

      Delete
  5. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచి సినిమా నిర్మాణం అంటే.. కల్ల..అండి.
    ఇవాళ సినిమా నాశనం చేసినంతగా ఇంకా ఏది నాశనం చేయదు అంటే..అతిశయోక్తిగా ఉంటుంది.
    నిర్మాత,దర్శకులకి, నటులకి రూపాయలు తప్ప విలువలతో కూడిన చిత్రాలు అందించాలనే భాద్యత ఉందంటారా!?

    ReplyDelete
    Replies
    1. ఈ సమాజంలో చెడు కున్న విలువ మంచికి లేదండీ!

      Delete
  6. ఆదరిచంచే ప్రేక్షక మహాశేయులు ఉన్నంతవరకు చెత్త సినిమాలు వస్తూనే ఉంటాయి, మనకు తప్పదు నాగేంద్ర గారు! హీరోలను ఆదర్సంగా తీసుకునే అమాయక జనం మనకు చాలా మంది ఉన్నారు. అసలు హీరోలను అందలం ఎక్కించేది వీరే. క్రమంగా వాళ్ళు కారణ జన్ములమనుకునే వాళ్ళు ఎంత మందో!

    ReplyDelete
  7. మీ స్పందనకి ధన్యవాదాలు వెన్నెల గారు!

    ReplyDelete