Tuesday, 24 April 2012

'మల్లీశ్వరి'



ప్రకృతి సోయగాల్ని, హృదయపు లాలిత్యాన్ని మేళవించిన పాటలు పరిమళిస్తాయ.  మనసున నిలిచి మధురానుభూతిగా మిగులుతాయి. 'మల్లీశ్వరి'  చిత్రంలోని ఈపాట  కోవలోకే వస్తుంది

మనసున మల్లెల మాలలూగెనె
కన్నుల వెన్నెల  డోలలూగెనె
ఎంత హాయి రేయి నిండెనో 
ఎన్నినాళ్ళకి బ్రతుకు పండెనో 

కొమ్మలు గువ్వలు గుసగుస మనినా 
రెమ్మల గాలులు ఉసురుసురనినా 

అలలు కొలనులో గలగలమనినా 
దవ్వుల రేణువు సవ్వడు వినినా 

నువ్వు వచ్చేవని -నీ పిలుపే విని 
కన్నుల  నీరిడి కలయ చూసితిని

గడియ ఏని ఇక విడిచి పోకుమా
ఎగసిన హృదయం పగుల నీకుమా 

ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో 
ఎంత హాయి రేయినిండెనో 

చిత్రం:    మల్లీశ్వరి 
రచన:    దేవులపల్లి కృష్టశాస్త్రి 
గానం:    భానుమతి 
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 

8 comments:

  1. నా "ఆపాతమధురాలు" బ్లాగ్ కోసం ఒక మంచి పాటని గుర్తు చేశారండీ.. థాంక్యూ

    ReplyDelete
  2. భానుమతి గారు పాడిన english song విన్నారా నాగేంద్ర గారు?
    "que sera sera..."

    ReplyDelete
    Replies
    1. ఇంగ్లీష్ లో కూడా పాడారా ? వినలేదండి!

      Delete
  3. రోజూ విన్నా విసుగు రాని పాటల్లో మల్లీశ్వరి సినిమా ఒకటి. ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి.

    ReplyDelete
  4. నా యూనివర్సిటీ చదువుల రోజుల్లో బాలాంత్రపు రజనీ కాంతారావు గారు మాకు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉండేవారు.నన్ను చూడగానే తరుచుగా ఈ పాటే పాడేవారు.ఆయనకు అత్యంత ఇష్టమైన పాటల్లో ఇదొకటి అని చెప్పేవారు.అద్భుతమైన పాటని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
    మల్లీశ్వరి.

    ReplyDelete
  5. very nice song.. MArapu raani paata. Thank you very much!

    ReplyDelete