Saturday, 21 April 2012

భూమాతను రక్షించుకుందాం!



ఇవాళ ధరిత్రీ దినోత్సవం.
     నాయకులు కాలుష్యనివారణ గురించి ప్రసంగిస్తారు.  మొక్కల్ని నాటమంటారు.  ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమంటారు. కానీ, వాళ్ళు మాత్రం ఇవేమీ చేయరు. నీతులు చెప్పడం ఇతరుల కోసమేనని వాళ్ళ ఉద్దేశం కాబోలు.
                                                                                                                                    లక్షలాదిలా పెరిగిపోతున్న వాహనాలువాటి నుంచి వెలువడుతున్న కాలుష్యం దేశాన్ని  కలవరపెడుతున్న సమస్య. పెరుగుతున్న కాలుష్యంతో జీవన విధానం గతి తప్పుతోంది.                                                                                                  నగరాలలో పరిశ్రమలు విడిచి పెడుతున్న పొగ జీవ రాసులకు సెగగా మారింది. దీనికితోడు పెరిగిపోతున్ననగరీకరణ మరింత కాలుష్యరహితసమాజాన్నివృద్దిచేస్తోంది. లక్షలాదిలా పెరిగి పోతున్న వాహనాలు, వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యం దేశాన్ని  కలవరపెడుతున్నసమస్య.  భూమి, నీరు, గాలి అన్నీ కలుషితమయి పోతున్నాయి. దీనికితోడు ప్లాస్టిక్ వినియోగం పరిసరాలకు, వాతావరణానికి, పర్యావరణానికి ప్రమాదకరమని తెలిసినా ప్లాస్టిక్ వస్తువులను విచ్చలవిడిగా వాడుతున్నారు.   నగరంలో చూసినా, యాత్రా స్థలంలో చూసినా ప్లాస్టిక్ దుర్గంధం పెచ్చరిల్లుతోంది. పెళ్ళిళ్ళలో వందలాది ప్లాస్టిక్ వస్తువులను వాడి పడేస్తున్నారు.  విందు వినోదాలపేరట ప్లాస్టిక్ ప్లేట్లు కూడా వచ్చాయిమనిషి ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిసి కుడా ప్లాస్టిక్ వినియోగానికి విపరీతంగా అలవాటు పడటం ధరిత్రికి పెద్ద వపత్తని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు.  ప్లాస్టిక్ వస్తువులు పచ్చదనాన్నినాశనం చేస్తున్నాయి. నీటిని కలుషితం చేస్తున్నాయి.అంతేకాకుండా పరిసరాలను విషపూరితం చేస్తున్నాయి.  

     ప్లాస్టిక్ లేని రోజుల్లో మన జీవన విధానం ఎలా ఉండేది ...మనకున్న ఉపకరనాలేమిటో గుర్తుకు తెచ్చుకుని ఎవరికి వారు ప్లాస్టిక్ వాడకం పట్ల తమకు తాము నిషేధం విధించుకోవాలి.  కాలుష్యకోరల్లో చిక్కుకొని అల్లాడుతున్న భూమాతను రక్షించుకోవాలి.  మనిషి అప్రమత్తతే ధరిత్రికి బాసట.

12 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు వెన్నెల గారు!

      Delete
  2. పర్యావరణం పరిరక్షించుకోవటం అందరి బాధ్యత !మంచి టాపిక్ బాగా వ్రాసారు.

    ReplyDelete
    Replies
    1. థాంక్స్...రవిశేఖర్ గారు!

      Delete
  3. భావి తరాలకి సహజ సంపదలని మిగల్చడం మాట అటు ఉంచి.. పర్యావరణాన్ని నాశనం చేసి..విపరీతంగా దుర్వినియోగం చేస్తున్న మానవ జాతికి మంచి మాటలు తలకేక్కుతాయాంటారా!?

    తనదాకా వస్తే కాని తెలియదు..

    అవగాహన ఉన్నా కూడా నిర్లక్ష్యం వహిస్తున్న ఈ దశలో పడే పడే చెప్పడం మినహా.. ఇంకేం చేయలేం కదండీ.

    మంచి విషయం చెప్పి.. కొంచెం చురక వేసారు. నా వంతుగా నేను గుర్తుంచుకుంటాను నాగేంద్ర గారు. థాంక్ యు వేరి మచ్.

    ReplyDelete
    Replies
    1. మానవజాతికి పుర్తిగాకాకపోయిన కొందరికైనా
      తలకెక్కాలనే ఈ మంచి మాటలు వనజ గారు!

      Delete
  4. వర్డ్ వెరిఫికేషన్ తీసివేయండి. చాలా మందికి కామెంట్ పెట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. గమనించండి.

    ReplyDelete
  5. వర్డ్ వెరిఫికేషన్ తీసేశానండి!

    ReplyDelete
  6. ప్రతి మనిషి ఒక మొక్కను పెంచాలి అని చట్టం తీసుకొని రావాలి.. ఆ మొక్క చెట్టుగా మారి ఆ మనిషి ఉన్న అన్నిరోజులు ఆ మొక్కను తన కన్నా తల్లిలా చూసుకోవాలి లేక పొతే మనిషి మనుగడ రాను రాను చాలా కష్టం అవుతుంది... మొక్కను పెంచక పొతే కటినమైన శిక్షలు విదించాలి... లేక పొతే మన ముందు తరాలకోసం మనం ఏమి ఇవ్వలేము...

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది కరెక్ట్ . పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎవరిమీదనో
      ఆధార పడకుండా మనచుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకుంటూ ప్రతి ఇంటి ముందు చెట్లను నాటి, ఇంకుడు గుంటలను తయారు చేస్తేనే ప్రభుత్వ సబ్సిడీలు అందుతాయని, అలాచేయనివారికి ప్రభుత్వ పథకాలు అందవని ప్రకటిస్తే తప్పకుండా ప్రజలల్లో మార్పు వస్తుంది.

      Delete
  7. Phaneedra gaaru,baagaa cheppaarandi, divi gundu ,bhuvi gundu, kondedduku pachchaganundu --ani aloachinchevaallu gunapatam nerchukoavali .pratee okkaru oka chettu penchalani chattam vastea chaalaabaaguntundi ,nenu amalu chestunnanu,chestanu kuda .manchi article vrasinanduku dhanyavaadaalu

    ReplyDelete