పెద్ద స్టార్స్‌కి కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చి, వారి డేట్స్ కోసం నెలల తరబడి హీరోల చుట్టూ తిరిగే దర్శక నిర్మాతలకు "ఈ రోజుల్లో " అనే చిన్న సినిమా ఓ చక్కటి గుణపాఠం నేర్పింది. ఎలాంటి తారాబలం లేకుండా అంతా కొత్త వారితో నిర్మించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. కేవలం యాబై లక్షలతో ఈ చిత్రాన్ని నిర్మించి, దాదాపు పది కోట్లు వసూలు చేసి, పెద్ద సినిమాలకు పోటీ ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. కథ విషయంలో దర్శకులు జాగ్రత్తలు తీసుకుంటే విజయం తధ్యమని 'ఈ రోజుల్లో'సినిమా దర్శకుడు నిరూపించారు. మండు వేసవిలో చల్లని హిమపాతంలా తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ఈ చిత్రంలో నిర్మాణ విలువలు ప్రతి ప్రేమ్ లోను కనిపిస్తాయి. నటీనటులంతా కొత్త వారయినా తమ తమ శక్తి మేరకు నటించారు. లక్షల రూపాయల పెట్టుబడితో కోట్ల రూపాయలు వసూలు చేసే సినిమానే పెద్ద సినిమా. అదే మెగా హిట్.
hai.. Nagendra gaaru..namasthe! chaalaa rojula tarvaata vacchaaru.
ReplyDeletechinna sinimaa.. ne kadaa! ee chitram choosaaraa? cell paata pai oka post vraasthunnaanu. wait ..Plz.
జనవరిలో ఫ్లాట్ కొన్నాను.... పిబ్రవరి లో గృహప్రవేశం... BSNL షిఫ్ట్ చేయడంలో ఆలస్యం కారణంగా రాయలేక పోయానండీ!
DeleteThis is a news to me! However I am glad that this film is doing well. I hope all those producers and directors out there will learn something from this and focus on the story. They are not understanding that good story and face value of so called good actors will do wonders.
ReplyDeleteతక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాలు తీయడానికి
Deleteదర్శక నిర్మాతలు ముందుకు రావాలండీ!