Sunday, 18 December 2011

భగవద్గీత పైన నిషేధమా?


రష్యాలో భగవద్గీతను నిషేధించాలంటూ కొన్ని సంస్థలు
కోర్టుకి వెళ్ళడం భారతీయులందరినీ అవమానించడమే
అవుతుంది. ఈ దురదృష్టకరమైన వార్త హిందూ మనోభావాలను
దెబ్బతీస్తుంది.  భగవద్గీతను తీవ్రవాద సాహిత్యమంటున్నరష్యన్లు
నిజంగానే పిచ్చివాళ్ళు. ఈ దుశ్చర్యను ప్రతి భారత పౌరుడు  తీవ్రంగా
ఖండించాలి. మనదేశంలో పుట్టిన భగవద్గీతను నిషేధించడానికి
వాళ్ళెవరు?  వెంటనే మన భారత ప్రభుత్వం స్పందించి "భగవద్గీత
పవిత్రమైన గ్రంధం " అని దౌత్యపరంగా ఆ మూర్ఖులకు తెలియచెప్పాలి.

9 comments:

  1. aunandee.. vyakthi swecchani,matha swecchanni bhangaparusthunnatlugaa undi..vaari charya.

    ReplyDelete
  2. నిషేదిస్తే వచ్చిన నష్టమేంటి? నిషేధం లేకపోతే లాభమేంటి? ISKCON కు పెరుగుతున్న ప్రాచుర్యం వల్ల, అక్కడి చర్చులు, కృష్ణుడిని శైతానుతో పోలుస్తున్నాయి. దానిలో భాగమే ఇది.

    ReplyDelete
  3. nooooo......WE SHOULD RAISE OUR VOICE..IT's DEFINITELY HURTING INDIANS....హిందువులా ...ముస్లిములా...జైనులా..పర్సీలా..అని కాదు...భగవద్గీత అనేది మన భారతీయ గ్రంధం...అందరి గ్రంధం.... మన కవుల పాండిత్యానికి ఒక గీటురాయి....ఈ చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను..

    ReplyDelete
  4. సరే! ఒప్పుకుంటా! నేనూ తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తా - దానివల్ల ఏంటి ప్రయోజనం? మన 'కవుల పాండిత్యం' అని అన్నప్పుడే, మీరు తెలిసో తెలియకో ఆ ఉపనిషద్‌ సారాంశాన్ని కించపరిచారు.

    Russianలను పక్కన పెట్టండి - 'నేను హిందువునని' చెప్పుకునే ఎంత మంది వద్ద గీత పుస్తకం ఉంటుంది? చదివిన వారెంతమంది? స్మశానాలలో, ఎవరన్నా పోయినపుడో తప్ప, మన భారతీయులకే గుర్తుకు రాదు. వాళ్ళెవరో దాన్ని నిషేదిస్తామంటే మాత్రం ఒప్పుకోమేఁ?

    ReplyDelete
  5. వనజ వనమాలి గారు! ధన్యవాదాలండీ మీ వ్యాఖ్యకి.

    ReplyDelete
  6. RAAF SUN గారు! కృతజ్ఞతలండీ మీ స్పందనకు.

    ReplyDelete
  7. తెలుగు భావాలు గారు! మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము.
    మనకూ కొన్ని హక్కులున్నాయి. అందులో భాగంగా ఎన్నికల్లో
    ప్రతినిధులను ఎనుకుంటాము. మన సమాజానికి ఏదయినా
    హాని జరిగితే మనం ఎన్నుకున్న పాలకులు తగిన చర్యలు
    తీసుకోవాలి. ప్రజలు ముందుకు రాకపోతే ఏ నాయకుడు ముందడుగు
    వేయడు. అందుకే ముందుగా మనం స్పందించాలి. ఇది మన భాద్యత.
    ప్రతిఒక్కరూ 'మనకెందుకులే ' అనుకుంటే వాళ్ళు మరింతగా రెచ్చిపోతారు.

    ReplyDelete
  8. naagendra kaaru super answer....naadi same answer andi TELUGU BHAAVAALU GAARU

    ReplyDelete
  9. మనకెందుకులే! అని ఎక్కడ అన్నానండీ? ముందు మన కనీస బాధ్యత నెరవేర్చి, తరువాత ఇతరులకు చెప్పాలి అన్న బ్రాంతిలో ఏదో తెలీక రెండు ముక్కలు రాశాను. ఇక్కడ దేశం 'క్లిష్ట పరిస్థితులలో' (రికార్డు స్థాయిలో రూపాయి విలువ పడటం వంటివి) ఉన్నా పట్టించ్చుకునే నాధుడు లేదు. ఇక ఇలాంటివాటినేం పట్టించుకుంటారులే అనుకున్నా. అందరమూ ఇలా ఖండిస్తూ పోతే, విషయం తెలుతుందంటే, నేనెందుకు ఖండించను? ఖండిస్తా...తప్పకుండా ఖండింస్తా. మళ్ళీ మళ్ళీ ఖండింస్తా. ఖండిస్తూనే ఉంటా. All the best...

    ReplyDelete