Sunday, 30 October 2011

నాగుల చవితి

కార్తీకమాసం   నెలరొజులూ పవిత్రమైనవే.  కార్తీకంలో శుక్ల పక్ష  చవితినాడు                                                 జరుపుకొనే పండుగ 'నాగుల చవితి'.  ఈ రోజున పెద్ద సంఖ్యలో మహిళలు 
పుట్టలో పాలు పోసి నాగదేవతను భక్తిశ్రద్దలతో పూజిస్తారు. బెల్లం,నువ్వుల 
పిండితో తయారు చేసిన చలిమిడిని నైవేద్యంగా  సమర్పిస్తారు. ఈ విదంగా
నాగదేవతను పూజిస్తే ఎన్నో ఫలితాలుంటాయని  భక్తుల  ప్రగాఢ  విశ్వాసం.
నాగులచవితి, నాగులపంచమి పవిత్రరోజులలో మాత్రమే సర్పాలను పూజించి,
మిగాతారోజులల్లో పాములు కనిపించగానే చంపడానికి ప్రయత్నం చేయకుండా 
వాటిని తోటి ప్రాణులుగా చూడాల్సిన భాద్యత మనందరిది. 


Tuesday, 25 October 2011

దీపావళి శుభాకాంక్షలు!


"దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్ధన! దీపేన హరతే పాపం సంధ్యాదీప నమోస్తుతే!"

సిరిసంపదలు సమకూర్చే దీపావళి మీ ఇంట ఆనందవెలుగులు నింపాలని కోరుకుంటూ....

బ్లాగరులందరికీ దీపావళి శుభాకాంక్షలు!


Monday, 24 October 2011

అమావాస్య వెన్నెల

నక్షత్రాలన్నీ దివినుంచి భువికి దిగివచ్చేరోజు, ప్రతియింటా నవ్వుల దీపాలు వెలిగేరోజు, పెద్దలు పిల్లలుగా మారేరోజు దీపావళి రోజు. దీపావళి గురించి రకరకాలుగా కథలు ఉన్నప్పటికీ అందులో నరకాసురుడి వధ ప్రధానమైనది. కాని, అన్ని కథల్లో 'చెడు' ఫై  'మంచి' చేసిన విజయమని తెలియజేస్తున్నాయి. ఈ విజయోత్సవానికి గుర్తుగా అమావాస్య నాడు ప్రతియింటా వెలుగులనునింపి, చీకటిని పారద్రోలడం  ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఇల్లన్ని శుభ్రపరచి చక్కగా అలంకరించి, సాయంత్రం దీపాలతో వెలుగులు నింపుతారు. కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ మహాలక్ష్మి తల్లిని ఆహ్వానం పలుకుతారు.మన పండులన్నిదాదాపు సూర్యోదయంతో మొదలయితే, దీపావళి మాత్రం సూర్యాస్తమయంతో ప్రారంభం కావడం విశేషం.కులమతాలకుఅతీతంగా, పెద్దలు, పిల్లలు అంతా  ఆనదంగా జరుపుకునే పండుగ వెలుగుజిలుగుల దీపావళి. ఈ పండుగనాడు బాణా సంచా కాల్చడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే బాణా సంచా కాల్చేటప్పుడు ప్రమాదాలకు గురికాకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు  తీసుకోవాలి. పిల్లలు, పెద్దలు సమక్షంలో ఆరుబైట బాణా సంచా కాల్చడం, టపాకాయలను విసిరేయకుండా ఉండడం, ప్రేలుడు టపాకాయలను తగినంత దూరంలో  ఉంచడం చేయాలి. చేతులు కాలకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలి. బాణా సంచా పేల్చడంలో జాగ్రత్తలు విస్మరిస్తే ప్రమాదాలు సంభవిస్తాయి.  తస్మాత్ జాగ్రత్త.
                    అందరికీ దీపావళి శుభాకాంక్షలు!

Thursday, 20 October 2011

హిజ్రాల ఆగడాలు

జంటనగరాలలో హిజ్రాల ఆగడాలు రోజురోజుకు శ్రుతిమించిపోతున్నాయి.  రోడ్డునపోతున్నవారు  వీరిని 
చూడగానే బెంబేలు పడాల్సిన పరిస్తితి  నెలకుంది.  ఉదయం నుంచి రాత్రి వరకు డబ్బు కోసం వీరి వేధింపులు 
ఆగడం లేదు. ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు .  ఉదయమే జంటలు జంటలుగా రోడ్డుమీదికి 
వచ్చి, వారు అడిగినంత డబ్బు  ఇవ్వకపోతే వారికి చుక్కలు చూపిస్తారు. అసభ్యకర ప్రవర్తన , భూతులు 
మాట్లాడుతూ వారిని కించపరుస్తూ   రచ్చ రచ్చ చేస్తారు.  వీరిబారినుండి ఎలా తప్పించుకోవాలో తెలియక 
ప్రజలు అవస్థలు పడుతున్నారు.  హిజ్రాలందరూ  ఆరోగ్యంగానే ఉన్నారు. కస్టపడి పనిచేసుకోవడానికి 
ఎన్నో మార్గాలున్నాయి. ఇలా ప్రజలను వేదించడం ఎందుకు?  అడుక్కోవడానికి ఎన్నోమర్గాలుండగా 
ప్రజలను పీల్చి పిప్పిచేయడం ఎందుకు?  ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. హిజ్రాల
జీవనోపాధికోసం  ప్రభుత్వం తగుచర్యలు తీసుకొని హిజ్రాల ఆగడాలను అరికట్టాలి.

Wednesday, 19 October 2011

టీవీల్లో వాణిజ్య ప్రకటనలు

టీవీల్లో వస్తున్న కొన్ని వస్తువుల వాణిజ్య ప్రకటనలు అభ్యంతరకరంగా ఉంటున్నాయి.  కుటుంభ సభ్యులంతా 
కలసి టీవీ చూస్తున్నప్పుడు జుగుస్సాకరమైన దృశ్యాలను ప్రసారం చేయడాన్ని నిలువరించాల్సిందే!  
సభ్యసమాజం  తలదించుకునేలా ఉంటున్న ఇలాంటి వాటిని ప్రసారాలకు ఎలా అనుమతిస్తున్నారో అర్థం 
కావడం లేదు. ప్రకటనలు వస్తు నాణ్యతకు సంబందించినదిగా ఉండాలి.  వాటి సద్గుణాలను ప్రజలకు  తెలియజేసేవిధంగా మలచాలి .  అసభ్య దృశ్యాలు  ఉన్న ప్రకటనల్ని ప్రసారం చేయడం నైతిక విలువలకు తిలోదకాలివ్వడమే అవుతుంది.  టీవీల యాజమాన్యం ఇలాంటి అసభ్యకరమైన  వాణిజ్య ప్రకటనలను 
తమ ఛానల్లో ప్రసారం చేయకుండా చూడాలి.

Tuesday, 18 October 2011

మన భాష తెలుగు భాష

మా ఆఫీసులో పనిచేసే వారంతా తెలుగువారే. కాని, తెలుగు మాట్లాడితే తమ హొదాకు భంగమనుకుంటారు.      తెలుగు మాట్లాడేవారిని చూసి నవ్వుకుంటారు.  తెలుగు పదాలను హేళన చేస్తుంటారు.  పరభాషా వ్యామోహంలో     పడి మన తెలుగు భాషను చిన్న చూపు చూస్తున్నారు.  తెలుగు భాషలోని తియ్యదనం ఇలాంటివారికి ఎంత       చెప్పినా చెవిటి వాడిముందు శంఖం ఊదినట్లు అవుతుంది.  కట్టు, బొట్టు తెలుగువారిదయినప్పుడు  తెలుగులో మాట్లాడటం అవమానంగా భావించడం ఎందుకు?  గొప్పలకుపోయి  మాతృభాషను కించపరచడం ఎందుకు?  ఇలాంటివారివల్ల తెలుగు సంస్కృతులు, ఆచారవ్యవహారాలు మాయమైపోతున్నాయి.  మధురమైన తెలుగు    భాషలోని పలుకులు తేనెలొలికే గులికలని, ప్రతి తెలుగుపదం వీనులవిందుగా, వినసొంపుగా ఉంటాయని మన తెలుగువాళ్ళు తెలుసుకొనే రోజు రావాలి.   

Wednesday, 12 October 2011

ప్రజల భాధలు

సకల జనుల సమ్మె కారణంగా ప్రభుత్వ కార్యాలయాలలో పనులు పూర్తిగా స్తంభించి పోయాయి.  నెల నుంచి విద్యాసంస్థలు తెరవకపోవడంతో విద్యార్థుల భవిషత్తుఫై తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. సమాజాన్నికలుషితం చేసే మద్యం షాపులు, సినిమాలను సమ్మెలో మినహాయించి విజ్ఞానాన్ని పంచే విద్యాసంస్థలను మూసివేయడం బాధాకరం. సమ్మె రోజురోజుకి ఉద్రుతరూపం దాల్చడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.పరిపాలనా వ్యవస్థ పూర్తిగా స్థమించి పోవడంతో అసలు ప్రభుత్వం అనేది వున్నదా అనే అనుమానం ప్రజలలో నెలకొంది. ఆర్టీసి బస్సులు తిరగకపోవడంతో ఆటోడ్రైవర్లు విపరీతంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికి అయినా ఉద్యమనేతలు స్పందించి విద్యార్థుల భవిషత్తును దృష్టిలో ఉంచుకొని సమ్మె నుంచి విద్యాసంస్థలను మినహాయింపు ఇచ్చి  ఆర్టీసి బస్సులను నడిపించి ఆటోడ్రైవర్ల బారినుంచి ప్రజలను కాపాడాలని మనవి. 

మంచి మాటలు

"నిజం చెప్పేవాడికి పనితనం ఎక్కువ 
అబద్దాలు చెప్పేవాడికి మాటలు ఎక్కువ"

* * * * * * * * * * * *

"కుడిచేత్తో నమస్కారం సంస్కారం 
ఎడమచేత్తో నమస్కారం తిరస్కారం"

* * * * * * * * * * * *

"పొదుపుగా వాడితే దొరుకుతుంది నీరు 
దుబారా చేస్తే మిగిలేది కన్నీరు"

* * * * * * * * * * * * 

"పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే భవిత 
పర్యావరణ రక్షణ మన భాధ్యత"

* * * * * * * * * * * *

Saturday, 1 October 2011

మహాత్మా గాంధీ 142 వ జయంతి సందర్భంగా---!

     మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుద్దాం!
     దేశాన్ని అభివృద్దివైపు నడిపిద్దాం!!