Wednesday, 31 August 2011
Sunday, 28 August 2011
కవితలు
నీకోసం
స్వాతి చినుకు కోసం
ఆర్తిగా చూసే
ముత్యపు చిప్పలా
వసంతకాలం కోసం
ఆశగా చూసే
కోయిలలా
రవికిరణం కోసం
కోరికగా చూసే
కమలంలా
కళ్ళనిండా
నీరుపాన్నినింపుకుని
మదినిండిన అనుభూతులతో
అనుక్షణం తపిస్తున్నా
నీకోసమే జీవిస్తున్నా
********************
ప్రజలు
ప్రశ్నించడం
మరచిపోయారు
నిలదీయటం
మానేసారు
చెయ్యిచాపిన
అధికారికి
అందించడం
నేర్చుకున్నారు
*******************
మన నేత
ఎన్నికలముందు
పున్నమి చంద్రుడిలా
చల్లని వరాలు
కురిపించేవాడు
ఎన్నికల తర్వాత
ఎండాకాలం సూర్యుడిలా
ముచ్చెమటలు పట్టించేవాడు
హైకూలు
హైకూలు
నిన్ను చూసింది
ఒక్క క్షణం
తపిస్తున్నాఅనుక్షణం
***************
ఒక్కటే బల్బ్
జగమంతా వెలుగు
నిండు చంద్రుడు
***************
చీకటిలో
వెతుకుతున్నా
వెలుగులా వస్తావని
***************
రోడ్డున పడ్డారు
త్వరలో
ఉపఎన్నికల కోలాహం
***************
Wednesday, 24 August 2011
మినీ కవితలు
అర్ధాంగి
నీ బాగుకోసం
కర్పురమయీ కరిగేది
నీ పురోగతిని చూసి
దివ్వెలా వెలిగేది
^^^^^^^^^^^^^^^^
స్త్రీ
ప్రేమగా చూస్తే
అవుతుంది తల్లి
నిత్యం వేధిస్తే
అవుతుంది కాళి
^^^^^^^^^^^^^^^
అక్షరం
అలసట లేనిది
ఆకాశంలా
అనంతమైనది
^^^^^^^^^^^^^^^
నెత్తుటి దాహంతో
తీవ్రవాదం
భయం గుప్పిట్లో
ప్రజల ప్రాణం
^^^^^^^^^^^^^^^
Tuesday, 23 August 2011
ఓ వినాయక ---
"దుష్టశక్తులను ఆదిమిపట్టు
అరాచక వ్యక్తులను తరిమికొట్టు
దేశానికీ రక్షణ కలిగించు
మాలో చిరుదీపం వెలిగించు"