”శోధిని”

Monday 30 April 2018

ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు!

ఆనాడు కార్మికుల చేత పశువుల్లా పనిచేయించకుండా పని గంటలు నిర్ణయించమని 'చికాగో' నగరంలో కార్మికులంతా సమ్మె చేసి విజయం సాధించారు. ప్రపంచానికి శ్రమ విలువను చాటి చెప్పి,శ్రమజీవుల బ్రతుకులలో వెలుగు నింపారు. ఈనాడు ప్రభుత్వ కార్యాలయాలలో తప్ప , ప్రైవేటు కార్యాలయాలు, కర్మాగారాలలో ఇప్పటికీ కార్మికుల చేత పశువుల్లా పని చేయించుకుంటున్నారు. దేశంలో పేరుకు పెద్ద కంపెనీలుగా చెలామణి అవుతున్న కార్పోరేట్ సంస్థలు కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ సంస్థలలో పనిచేసే కార్మికులకు కంటినిండా నిద్రలేక, సమయానికి తిండి లేక ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. ఎక్కవ జీతానికి ఆశపడి కార్పోరేట్ సంస్థల కబంధహస్తాలలో ఎందరో కార్మికులు చిక్కుకొని రోదిస్తున్నారు. ఇలాంటి కార్మికుల జీవితాలలో వెలుగును నింపే రోజే నిజమైన ప్రపంచ కార్మిక దినోత్సవం.

Saturday 14 April 2018

ఇది మల్లెలమాసం....

                                                                                                                                    మన కళ్ళ ఎదుట మల్లెపూలు  కనిపించినా, వాటి వాసనలు తగిలినా మానసిక ప్రశాంతత అభిస్తుంది. సుకుమారమైన అందం, మనోహరమైన వాటి పరిమళ భరితాలు మనసును ఉల్లాసపరుస్తాయి.   అంతేకాదు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చే శక్తి ఈ పుష్పాలకుంది.   మండుటెండలో ఆహ్లాదాన్ని కలిగించే పుస్పాలలో మల్లెలది ప్రధమస్థానం.  ఎంత ఎండ కాచినా, పచ్చగా కళకళలాడే ఆకుల మాటున తెల్లని మల్లెమొగ్గలు మురిపిస్తాయి. తమ సుగంధాలతో పరిసరాలను నింపేసి ఉత్సాహాన్ని ఇస్తాయి. మనసును సమ్మోహన పరచి ఏదో లోకానికి తీసుకెలతాయి.  మధురోహాలతో పులకింపజేసి మొహనరాగాలను పలికిస్తాయి.    కమ్మదనానికి, చల్లదనానికి పెట్టింది పేరయిన మల్లెలంటే అందరికీ ఇష్టమే. మల్లెల మాధుర్యం మాటల్లో చెప్పలేనిది.  వాటి పరిమళాలకు ఎంతటివారైనా ఫిదా కావాల్సిందే!                                                                                    

Friday 13 April 2018

సప్తగిరులు

శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుని ఏడుపడగలే తిరుమలలో కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువై ఉన్న సప్తగిరులని పురాణప్రతీతి. పచ్చనిలోయలు, జలపాతాలు, అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనే సప్తగిరులు.