”శోధిని”

Thursday 31 December 2015

హ్యాపీ న్యూ ఇయర్ !

కొత్త ఆశలు, కొత్త నిర్ణయాలు, కొత్త లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న మిత్రులకు  సకల శుభాలు, నిత్య సంతోషాలు కలగాలని మనసారా కోరుకుంటూ...నూతన సంవత్సర శుభాకాంక్షలు !  2015 పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కోటి ఆశలతో  2016 నూతన ఆంగ్ల సంవత్సరానికి  స్వాగతం పలుకుదాం !!


Wednesday 30 December 2015

అచ్చ తెలుగు సౌందర్యం !



ఆమె నీలి కళ్లల్లో...
వేయి ఇంద్రదనస్సులు
ఆమె చిరునవ్వులో...
కోటి ముత్యాల కాంతులు
మోములో  సున్నితత్వం...కోమలత్వం
అచ్చ తెలుగు సౌందర్యంలా...
మెరిపిస్తోంది...మురిపిస్తోంది !



Thursday 24 December 2015

ప్రేమతో ఎదైనా సాధించవచ్చు !



'ప్రేమతో ఎదైనా సాధించవచ్చని'  జీసస్ చెప్పారు.  నువ్వు ఎదుటివారిని మనస్పూర్తిగా ప్రేమిస్తే ...నిన్ను కూడా అవతలి వాళ్ళు అంతే ఇష్టంగా ప్రేమిస్తారు. మన కోసం కాకుండా ఇతరుల కోసం ప్రార్థన చేయాలి.... అందరూ మంచిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించాలి....సాటి మనిషిని మనస్పూర్తిగా ప్రేమించడం నేర్చుకోవాలి.    ఇతరుల సంతోషం కోసం, వారి సుఖసౌఖ్యాల కోసం ప్రార్థన చేయాలి.  స్వార్థపూరితమైన  ప్రార్థనలను  దేవుడు మెచ్చడు.  నీతి, నిజాయితీగా నడిస్తే ఏసుక్రీస్తు ఎంతగానో సంతోషిస్తాడు.  మన మనసు పరిశుద్ధంగా వుంచుకున్నప్పుడే  దేవుడు మనలో  ప్రవేశిస్తాడు.   సంపూర్ణమైన ఆయన  ఆశీర్వాదం,  ఆశీస్సులు లభిస్తాయి.

       మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు !





Monday 21 December 2015

ముక్కోటి దర్శనం !


ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో శ్రీవారి స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది.  స్వామి వారు శ్రీదేవి, భూదేవి  సమేతంగా స్వర్ణరథంపై ఆలయ పురవీధుల్లో దర్శనమిచ్చారు.  వేయి కళ్ళతో ఎదురు చూసిన భక్తజనం శ్రీవారి  ఉత్తర దివ్యదర్శనంతో పులకించి పోయారు. భక్తి పారవశ్యంలో మినిగి పోయారు. మరో ప్రక్క బంగారు కాంతులీనే ఆనంద నిలయం. ఎటు చూసినా అన్నమయ్య కీర్తనలు, భజనలు, కోలాటాలు  చేసే బృందాలు...గోవిందనామస్మరణలు. భక్తుల ముఖాల్లో ఆనందం ...సంతృప్తి.




Sunday 13 December 2015

వీళ్ళు మారరు (జోక్)

ఎప్పుడూ సెలబ్రిటీలను ఇంటర్వ్యూచేసే  విలేఖరికి ఓ ఐడియా వచ్చి,  బిక్షగాడిని  ఇంటర్వ్యూ చేయాలనుకున్నాడు. 
"మీకు అనుకోకుండా రోడ్డు మీద లక్ష రూపాయలు దొరికితే ఏంచేస్తారు?" బిక్షగాడిని అడిగాడు విలేఖరి.
" వెండి  బొచ్చెలో అడుక్కుంటాను" 
"అదే పది లక్షలు దొరికితే ?"
"బంగారు బొచ్చెలో అడుక్కుంటాను"
"కోటి రూపాయలు దొరికితే?"
"విమానం టిక్కెట్టు కొని విమానంలో అడుక్కుంటా!"
ఆశ్చర్య పోవడం విలేఖరి వంతయింది.  

 

Saturday 12 December 2015

"పర్ణశాల"

Kayala Nagendra's photo.


శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు భద్రాచలంకు 33 కిలోమీటర్ల దూరంలో వున్న పర్ణశాలలో నివసించినట్లు, ఇక్కడున్న వాగు వద్ద సీతాదేవి స్నానం చేసిన తరువాత గుట్ట పైన చీరలు ఆరవేయగా, రాళ్ళ పైన చీరల ఆనవాళ్ళు ఏర్పడ్డాయని కథలుగా చెప్పుకుంటారు.