”శోధిని”

Sunday 20 October 2013

ప్రేమలోకం !

 
ప్రకృతి కంటే...
 అందమైనది
పాలుకంటే... 
స్వచ్చమైనది 
తేనెకంటే... 
మధురమైనది 
మల్లెపువ్వులాంటి 
మీ మనసు 
అందుకే,
వెన్నెల సాక్షిగా...
నీ చిరునవ్వు సాక్షిగా ... 
మనసు నిండా
నిన్నే ధ్యానిస్తున్నా 
ప్రేమ పుష్పాలతో 
నిత్యం పూజిస్తున్నా! 

Saturday 12 October 2013

మా నాయకులకు జ్ఞానోదయం కలిగించు తల్లీ!

 
'అమ్మా' అని ఆర్తిగా పిలిచినవారిని అక్కున చేర్చుకునే జగజ్జననీ... దారితప్పి తిరుగుతున్నరాష్ట్ర రాజకీయనాయకులకు సరైన దారి చూపించు.  తమ పదవులకోసం రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న నాయకుల కళ్ళు తెరిపించు.  ఒకప్పుడు అభివృద్ధిలో ప్రధమ స్థానంలో ఉన్న  రాష్ట్రం, ఇప్పుడు చిత్తసుద్ధి లేని నాయకుల వలన అభివృద్దిలో కుంటుపడింది.  ఐక్యమత్యమే మహాబలం అనే విషయాన్ని మా నాయకులకు భోదించి, స్వార్థపూరిత రాజకీయ బుద్దిని విడనాడేటట్లు చూడు తల్లీ. ఒకరి పైన ఒకరు బురద చల్లుకోకుండా వారిలోని గర్వం, అహంకారం, ఇర్ష్య, అసూయ లాంటి శత్రువులను రూపుమాపి, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయి భవానీ.   మా నాయకులకు జ్ఞానోదయం కలిగించి, మా మనస్సులలోని అశాంతిని తొలగించి ప్రశాంతతను ప్రసాదించు విశ్వ మాతా!

మిత్రులందరికీ ....విజయదశమి శుభాకాంక్షలు!


Thursday 10 October 2013

శ్రీవారి స్వర్ణరథం!

 
తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా  శ్రీ వేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన నూతన స్వర్ణ రథాన్ని గురువారం మాడ వీధుల్లో ఊరేగించారు. 

ప్రేమ మాధుర్యం!


                                                                                             
                                                      









హరివిల్లులా విరిసి...
విరిజల్లులా కురిసి...
మదిలో సందడి చేశావు
మనసంతా మల్లెలు పరచి... 
యెదలో అలజడి రేపి... 
ప్రేమ మాధుర్యాన్ని 
నాలో నింపావు 
అందుకే నీ దరహాసాన్ని 
నా హృదిలో ముద్రించుకున్నాను 
నీ రూపలావణ్యాన్ని 
శాశ్వతంగా నాలో నింపుకున్నాను 
మన ప్రాంతాలు వేరైనా 
మన  ప్రేమకు హద్దులు లేవు 
నా పయనం మాత్రం నీ వైపే! 

Wednesday 9 October 2013

శ్రీహరి కన్నుమాత


తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలతో తన కెరీర్ మొదలు పెట్టి, హీరోగా ఎదిగిన రియల్ స్టార్ శ్రీహరి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసాడు.  ఆయన గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో భాద పడుతున్నట్లు సమాచారం.  తెలుగు చలన చిత్ర రంగం ఒక మంచి నటుణ్ణి కోల్పోయింది.

Tuesday 8 October 2013

కలిసి వుందాం!

ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా 
సృష్టిలోని ప్రతి వస్తువూ 
ఎదోక రూపంలో మనకు 
సౌఖ్యాన్ని, ఆనందాన్ని
అందిస్తున్నాయి 
ఆప్యాయతానురాగ  బంధాలకు 
ప్రతిబింబాలయిన వీటికి 
కులమత భేదాలు తెలియవు 
ఈర్ష్యాద్వేషాలు ఉండవు 
వీటిని ఆదర్శంగా తీసుకుని 
మనమంతా ... 
నిష్కలమైన మనసుతో 
సౌబ్రాత్యుత్వంతో... 
కలిసి మెలిసి మెలుగుదాం 
ఒకరికొకరం తోడుగా నిలబడదాం!

Monday 7 October 2013

ఆలయ అధికారులు కాస్త ఆలోచించండి!



రాష్ట్రంలో ప్రముఖ పుణ్య స్థలాలను దర్శించుకోవడానికి ప్రతి రోజు వేలాది మంది భక్తులు వెళుతుంటారు. అయితే అక్కడ గర్భగుడిలో ప్రశాంతంగా ఒక్క క్షణం నిలబడి దేవుణ్ణి కనులారా చూసే భాగ్యం కలగడం లేదు. ముఖ్యంగా తిరుమలలొ పెద్ద పెద్ద వి ఇ పి లకే శ్రీ వేంకటేశ్వరుని దర్శన భాగ్యం కలుగుతుందనే అపోహ లేకపోలేదు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో ఎన్నో సౌకర్యాలు కలుగజేస్తున్నారు. కాని, గర్భగుడిలోకి వచ్చేసరికి ఒక్క సారిగా యుద్ద వాతావరణం నెలకొంటోంది. దాంతో ప్రశాంతంగా స్వామిని చేసే అవకాశం భక్తులు కోల్పోతున్నారు. ఇంటి దగ్గర నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలతో బయలుదేరితే, అక్కడ దేవాలయ సిబ్బంది తీరు వల్ల భక్తులకు చేదు అనుభవం ఎదురవుతోంది. దయచేసి ఆలయ అధికారులు కాస్త ఆలోచించి ప్రత్యేక దర్శనాలను తగ్గించి, ఒక్క క్షణమైనా స్వామిని దర్శించుకునే అవకాశం భక్తులకు కల్పిస్తే బాగుంటుంది.