”శోధిని”

Saturday 28 September 2013

కలిసి జీవిద్దాం!

అపార్ట్మెంట్స్ లో అన్ని వర్గాలు నివసిస్తూ ఉంటారు కాబట్టి, అపార్ట్మెంట్ 'నాది, మనది' అనే భావన అందరిలో కలగాలి.  ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈర్ష్యా, ద్వేషభావాలు వీడి సందర్భోచితంగా మాట్లాడు కోవాలి. స్వంతనిర్ణయాలు తీసుకోకుండా అందరితో కలిసి పోతుంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.  మనిషిని చెడకొట్టడంలో మనసు పాత్ర చాలా గొప్పది.  అది మంచివాళ్ళ ను తిడుతుంది, చెడ్డ వాళ్ళను పోగుడుతుంది. మనసును అదుపులో పెట్టుకోకపోతే అడుగడుగునా కష్టాలను తెచ్చిపెడుతుంది.  అందుకే మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటివారి హృదయానికి పువ్వులా తాకాలి.  అంతేకాని బురదలా అంటుకోకూడదు.  కలసి మెలసి ఒకచోట నివచించే వాళ్ళు సంభాషణలను కోపంతో కాకుండా నిదానంగా మొదలు పెడితే ఏ గొడవలు ఉండవు. ఎదుటివాళ్ళు కుడా అదేవిధంగా స్పందిస్తారు. ఎదుటివాళ్ళు మన మాటల్ని ఒప్పుకోవాలనే ఉద్దేశంతో గట్టిగా అరవడం, గంతులు వేయడం సంస్కారం అనిపించుకోదు. పక్కవాడు మనల్ని ఎలా గౌరవించాలని అనుకుంటామో, అదే విధంగా వాళ్ళను మనం గౌరవించాలి. సమస్యను మాత్రమే మాట్లాడుకోవాలి తప్ప, గతంలో జరిగిన విషయాలను ప్రస్తావించిడం వల్ల సమస్య మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు.  మెజారిటి సభ్యుల అభిప్రాయాలను గౌరవిస్తూ... తోటివారితో సోదరభావంతో మెలుగుతూ ... ఆప్యాయత, అనురాగాలనులను పంచుకోవడానికి ప్రయత్నిచాలి. చెడుకు దూరంగా, మంచికి దగ్గరగా ఉంటే, ఏ అపార్ట్మెంట్ అయినా ఒక 'బృందావనం'లా... 'ఆనంద నిలయం'లా వెలుగుతుంది.  



'దేవుడమ్మ' చిత్రంలో S.P.బాలు గారు పాడిన పాట

ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు
స్వామి (అమ్మా) ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు
మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
అంతా మా సొంతమని అనిపిస్తావు
అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా చేసేస్తావు
స్వామి (అమ్మా)ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు

                             * * * * * *


Wednesday 25 September 2013

మన ప్రజా ప్రతినిధులు!

కొందరు అధికారం కోసం 
ప్రజలను పావులు చేస్తే,
మరికొందరు పదవుల కోసం 
నమ్ముకున్న ప్రజలను 
నయవంచన చేస్తున్నారు 
అధికారం పొందాలంటే 
తెలుగు జాతిని ముక్కలు చేయాలా? 
తమ పదవుల కోసం 
ప్రజల మధ్య చిచ్చు పెట్టాలా?
రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేసినా 
ప్రజలకు వోరిగేది ఏమీలేదు
లాభం మాత్రం రాజకీయ నాయకులకే!
ఇలాంటి నాయకులకు
ఓటు అడిగే హక్కు లేదు
ప్రజల మధ్య తిరిగే అర్హత
అంతకన్నా లేదు.


Tuesday 24 September 2013

రాష్ట్ర సమస్యను పరిష్కరించండి!

రాష్ట్రంలోనెలకొన్న పరిణామాలు సామాన్య ప్రజల్నిఅనేక ఇబ్బందులకు గిరిచేస్తున్నాయి. గత 57 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పడకేసింది.  ప్రజాప్రతినిధులేమో తమ పదవులను కాపాడుకుంటూ తమకేమీ పట్టనట్ట్ల్లు వ్యవహరిస్తున్నారు. సమస్య  పరిష్కారం కనుక్కోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.  ఇప్పటికే నిత్యావసర ధరల తాకిడితో బాధపడుతున్న ప్రజలను తాజా పరిస్థితులు మరింత కుంగదీస్తున్నాయి. సీమాంద్ర లో స్కూళ్ళు నడవడం లేదు.  బస్సులు తిరగక పోవడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు.  ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లయినా లేదు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి కలసికట్టుగా రాష్ట్ర పరిష్కారానికి కృషి చేయండి.  పార్టీల మధ్య ఐక్యత లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చిందని తెలుసుకోండి.  రాజకీయ పార్టీ నాయకులందరూ  ఒక చోటకు చేరి ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకుని రాష్ట్ర సమస్యను పరిష్కరించండి.  సమస్యల సుడిగుండంలోంచి ప్రజలను బయటికి తీసుకురండి. లేకుంటే రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం  చెల్లించుకోక తప్పదు.


పవిత్ర కోనేరు!

వికారాబాద్, అనంతసాగర్ లో వెలసిన శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రక్కన ఉన్న కోనేరు ఇది.

ఇక్కడ ధారగా ప్రవహిస్తున్న నీరు 365 రోజులు, 24 గంటలు ఏకధాటిగా రావడం విశేషంగా చెప్పుకుంటారు.

  వచ్చిన నీరు వచ్చినట్లు మరో మార్గం ద్వారా వెళ్లిపోవడంతో ఎలాంటి కలుషితం లేని స్వచ్చమైన నీటిని  

ఇందులో మనం చూస్తాం.






Sunday 8 September 2013

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!

భారతీయుల ఆరాధ్య దైవం 'వినాయకుడు'.  ఓంకార స్వరూపమే గణపతి స్వరూపం అంటారు.  నిందలను, విఘ్నాలను తొలగించి ముక్తిని ప్రసాదించే గణనాధుడిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ సంవత్సరం తొమ్మిదో తేది సోమవారం వినాయక చవితి. ఈ రోజున మధ్యాహ్నం 3.32గంటల వరకే చవితి ఉండటం వలన వినాయక ప్రతిమను ఈలోగా స్థాపన చేసి పూజ ముగించాలి.  ఉదయం 7.30 గంటల నుంచి 9.00 గంటల వరకు రాహుకాలం ఉండటం వలన ఈ సమయంలో వినాయక ప్రతిమను స్థాపన, పూజలు చేయరాదు. 

ఓ వినాయకా...
దుష్టశక్తులను అదిమిపట్టు
అరాచక శక్తులను తరిమికొట్టు 
దేశానికి రక్షణ కలిగించు 
మాలో చిరుదీపం వెలిగించు

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!


Tuesday 3 September 2013

నేటి పిల్లలు!

కార్పోరేట్ చదువులకి అలవాటు పడిన పిల్లలు మాతృ భాషలో మాట్లాడలేక పోతున్నారు. ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పు లేదు, కాని మాతృ భాషను చిన్న చూపు చూడటం మంచిది కాదు. ఇవన్నీ నేటి బాలబాలికలకు నేర్పించాల్సిన భాద్యత ఇటు తల్లిదండ్రుల పైన, అటు ఉపాధ్యాయుల పైన ఉంది. పిల్లలకు చిన్నవయసులోనే దైవభక్తి, దేశభక్తి, పెద్దలను గౌరవించడం నేర్పించాలి. మన సంస్కృతి, సంప్రదాయాలు, బంధాలు, ఆప్యాయతల గురించి తెలియజేయాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పిల్లలకి అవసరమే కాని, మన సంస్కృతిని, నైతిక విలువలను విస్మరించడం మంచిది కాదు.



కూరగాయల అలంకరణలో శ్రీ ఆంజనేయస్వామి!