”శోధిని”

Thursday 30 May 2013

మన తెలుగోడు !

పక్కవాడి ఎదుగుదలను చూసి 
జీర్ణించుకోలేని వాడు... 
తనమాటే వినాలి అనే 
అహంభావం కలవాడు...  
ఏదోవిధంగా ఎదుటివారిని 
అవమాన పరచడానికో,
భాధించడానికో ప్రయత్నించేవాడే...  
మన తెలుగోడు ! 

Sunday 26 May 2013

హాట్ హాట్ యాంకర్!

 
     గలగల నవ్వుతూ, సిగ్గులోలికిస్తూ, తుళ్ళుతూ మాట్లాడటం టీవి యాంకర్ల లక్షణం.  ఈ లక్షణాలన్నీ పుష్కలంగా వున్న కొత్త యాంకర్ అనసూయ.  అందుకే ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆడియో ఫంక్షన్లలోనూ, టీవి ఛానల్ లోనూ అనసూయ పేరు మారుమ్రోగుతోంది.  ఆమె హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె ధరించే దుస్తులలోనూ ప్రత్యేక  శ్రద్ద కనపరచడంతో  ప్రేక్షకుల మతులను పోగొడుతూ దూసుకు పోతోంది. ఇప్పుడామెకి మంచి డిమాండ్ ఏర్పడింది. హాట్ హాట్ గా యాంకరింగ్ చేస్తున్న అనసూయ స్పీడును చూసి ఇతర యాంకర్లు బిత్తరపోతున్నారు.  ఎప్పుడూ పాత ముఖాలేనా? కొత్తవారిని కుడా ప్రోత్స హిస్తామని ప్రేక్షకులు కుడా డిసైడ్ అయిపోయారు.  దాంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది అనసూయ. బెస్ట్ అఫ్ లక్  అనసూయ!



Saturday 25 May 2013

మురిపాలు!

 
జింకపిల్లను చేరదీసి
ఓ మాతృమూర్తి ఔదారాన్ని
చాటుకుంటున్నారు. 
కంటికి రెప్పలా చూసుకుంటూ... 
తన బిడ్డతో సమానంగా
పెంచుకుంటూ ఆప్యాయంగా
జింక పిల్లకి పాలు త్రాగిస్తున్న దృశ్యం!


Wednesday 22 May 2013

కులమతాలు మనకొద్దు!


'కులం' కల్మషాన్ని పెంచుతుంది 
'మతం' మానవత్వాన్ని చంపుతుంది
అందుకే ఈ కులమతాలు మనకొద్దు
మనందరిదీ  ఒకే కులం ...ఒకే మతం!
అదే మానవ కులం... మనవ మతం !!


Monday 20 May 2013





ఉషోదయ కాంతులోంచి
ఉద్భవించిన ప్రియతమా...
నా శ్వాశలో శ్వాశవై
కన్నుల్లో మెరిసావు
రవి కిరణాలలోంచి
ఉదయించిన హృదయమా...
నా ఊపిరిలో ఊపిరివై
చూపుల్లో నిలిచావు
నీ చిరు దరహాసంతో 
హృదయతీరాలను తాకావు 
నాతో  జీవితం 
పంచుకోకపోయినా 
నిత్యం నిన్నే తలచుకునే 
భాగ్యం కల్పించావు 

Saturday 18 May 2013

బాబోయ్ ...కొబ్బరి బొండాంలు!



సహజసిద్ధ మైన, స్వచ్చమైన లవణాలు, విటమిన్లతో  నిండిన అమృతపానీయం  కొబ్బరి నీళ్ళు.  వయసురీత్యా వచ్చే ఉగ్మతలను ఈ కొబ్బరి నీళ్ళు నివారించగలవు.  అందుకే ఈ కొబ్బరి చెట్టును 'కల్ప వృక్షం' అన్నారు మన పెద్దలు. కొబ్బరి నీళ్ళు దాహాన్ని తీర్చే గుణంతో పాటు శరీరాన్ని చల్లపరచే గుణం వుంది.  అయితే వీటి ధర మాత్రం కొండెక్కి కూర్చుంది.  వ్యాపారస్తులు అయిదు రూపాయలకు రైతుల దగ్గర కొని, మనకు ఇరవయి రూపాయలకు అమ్ముతున్నారు. ఫలితంగా అటు   కష్టపడి పండించిన రైతులు ... ఇటు ఇరవయి రూపాయలకు కొన్న ప్రజలు నష్టపోతున్నారు. వ్యాపారస్తులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు.  


Friday 17 May 2013








ప్రియా... 
నువ్వెంత  దూరంలో వున్నా...  
నిరంతరం నీకు చేరువులో వున్నా 
నీ తీపి జ్ఞాపకాలతో ...  
జీవితాన్ని గడిపేస్తున్నా! 
నిన్ను చూడటానికి ... 
ప్రతిరోజూ జన్మిస్తూనే వున్నా
నిన్ను మరువలేక... 
ప్రతి క్షణం మరణిస్తూనే వున్నా! 
మదిని దోచిన ప్రియతమా... 
ఎన్నాళ్ళీ  అంధకారం
నాపై కురిపించవా మమకారం!  

Tuesday 14 May 2013

ఇది నిజం!


"మానవులు, జీవుల్ని పీక్కుతింటూ... 
కల్మషాన్ని, కాలుష్యాన్ని వెదజల్లుతుంటే!
రాబందులు, కాబేళాలను తింటూ... 
ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుతున్నాయి!!"


Friday 3 May 2013

తాగునీటి సమస్యలు


తేది. 04-05-2013. 

నేస్తం... నేవ్వే సమస్తం!













మనకో మంచి స్నేహితుడు కావాలంటే, ముందుగా మనం మంచి స్నేహితుడిగా మారాలి. మనం వారిని అర్థం చేసుకోగలిగితే స్నేహం చిరకాలం ఉంటుంది.  స్నేహం కలకాలం సాగాలంటే చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత  అవసరం. మనసారా, మనస్పూర్తిగా స్నేహం చేసినప్పుడే ఆ స్నేహం మంచి పరిమళాలు వెదజల్లుతూ స్నేహ కుసుమాలను వికసింపజేస్తుంది.  నిజమైన స్నేహితులు ఎన్ని గొడవలు జరిగినా,ఎన్ని ఆపదలు వచ్చినా మళ్ళీ కలిసిపోతారు . అలాంటివారు కలసి చివరిదాకా స్నేహితులుగా మిగిలిపొతారు. అవసరం కోసం వాడుకొనేవాడు నిజమైన స్నేహితుడు కాలేడు.  అలాంటివాళ్ళు మనతో కొంత దూరమే పయనించి తర్వాత విడిపోతారు. స్నేహితుడంటే మన కోసం తన జీవితాన్ని త్యాగం చేయిగలిగే మనస్సు ఉంటె చాలు. కాని, ఈ లోకంలో ఎక్కడో వేలల్లో ఒకరు ఇలాంటి స్నేహితుడు ఉంటారు.  అలాంటి  మంచి స్నేహితుడు ఒక్కరు దొరికినా చాలు జీవితం ఆనందమయం అవుతుంది. ఇలాంటి స్నేహితుల్ని సంపాదించు కోగలిగిన వారు చాలా అదృష్టవంతులు.