”శోధిని”

Monday 31 December 2012

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

 

       నూతన సంవత్సరం  అంటే ఒక సంవత్సరాన్ని  వెనక్కి పంపి ఇంకొక సంవత్సరాన్ని ముందుకు  తీసుకురావడం . వెళుతున్న పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ, వస్తున్న  కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం.

     గత సంవత్సరం లో జరిగిన చెడును మరచి పోయి, మంచిని గుర్తుచేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశయాలతో అడుగు పెడదాం.  ఈ నూతన సంవత్సరం మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికి సకల శుభాలు కలగాలని ఆశిస్తూ ఆంగ్ల నూతన సంవత్సర  (2013) సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు!

        ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఏకైక వేడుక ఇదే కాబట్టి, మన జీవితంలోనే కాకుండా ఎదుటి వారి జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరం ఆనందం వెల్లివిరియాలని ఆశిద్దాం.

               అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

            WEL COME- 2013.

Friday 28 December 2012

కీచక భారతం

 
దేశ రాజధానిలో సాముహిక అత్యాచారానికి గురయిన బాధితురాలు, సింగపూర్ లో చికిత్స పొందుతూ శనివారం తెల్లరారుజామున తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ద్రువీకరించారు. ఆమె మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.  ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. ఇప్పటికైన  విచారణ అంటూ కాలయాపన చేయకుండా ఈ ఘటలకు కారకులయిన మృగాలను వెంటనే ఉరి తీయాలి. అప్పుడే ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.

Monday 17 December 2012

ఉపాద్యాయ వృత్తి ఏంతో గౌరప్రదమైనది.

 
ఉపాద్యాయ వృత్తి  ఏంతో  గౌరప్రదమైనది.  తల్లిదండ్రుల తర్వాత మనిషి వ్యక్తిత్వ వికాసంలో అద్యాపకులదే  కీలక పాత్ర..  అంతేకాకుండా సమాజంలోని ప్రతి రంగంలోనూ ఉపాధ్యాయుని ప్రభావం కచ్చితంగా ఉంటుంది.  తనను తాను సంస్కరించుకుంటూ సమాజాన్ని సంస్కరించాలి కాబట్టి, ఏ  మాత్రం నిర్లక్షంగా  వ్యవహరించినా... ఒక తరం తీవ్రంగా నష్టపోతుంది.  అందుకే పిల్లలకు పాఠాలు చెప్పే గురువులు భాద్యతగా  వ్యవహరించాలి.  విద్యార్థులలో ఆసక్తిని రేకెత్తించే స్థాయిలో భోదనలు చేయాలి.  విధినిర్వహణలో నిబద్దత, క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించాలి.పాఠ్యంశాలలోని మాధుర్యాన్ని విద్యార్థులకు చవి చూపించాలి.  విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నాడంటే  అందులో ముఖ్యపాత్ర అద్యాపకులదే.  విద్యార్థులకు వినయ విధేయతలతోపాటు విద్యాబుద్దులు నేర్పి వారి భవిష్యత్తుకి బాటలు వేసేది ఉపాద్యాయులే. దేశం ప్రగతి పథంలో నిలబడాలంటే విద్యార్థులకు మంచి విద్యనందించే అధ్యాపకులు నేడు ఎంతో  అవసరం.  విద్యార్థులు కుడా గురువులను గౌరవించినప్పుడే వారి ఆశయం నెరవేరుతుంది.

Friday 14 December 2012

 
నీ సోగకనులు... 
విరబూసిన తామరలు!
నీ వోరచుపులు...
హృదిని గుచ్చుకునే 
మన్మధ బాణాలు!
నీ చిరునవ్వుల పరిమళాలు...
నా హృది సేదతీర్చే పులకింతలు!

Monday 10 December 2012

"ప్రేమను ప్రేమించు...ప్రేమకై!"

"ప్రేమను ప్రేమించు...ప్రేమకై!" సభ్యుల గ్రూప్ ఫోటో 

అపార్ట్ మెంట్లో అగ్ని ప్రమాదాలు.

 
        గత నెల నవంబర్ హైదరాబాద్, మణికొండలో ఒక సీరియల్ చిత్రీకరణ కోసం వేసిన షెడ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. తర్వాత పక్కనే ఉన్న 'బాబా నివాస్ అపార్ట్ మెంట్' కు మంటలు అంటుకోవడంతో ఓ పసికందువు తో పాటు ఆరు నిండు ప్రాణాలు బలై పోవడం జరిగింది.  ఎంతకీ షెడ్ నుంచి అపార్ట్ మెంట్ కు మంటలు ఎలా వ్యాపించాయంటే...అపార్ట్ మెంట్లో ఆరవేసిన దుస్తులు అంటుకోవడంతో అపార్ట్మెంట్ కు మంటలు వ్యాపించడం జరిగిందట.  లక్షల రూపాయలను పోగు చేసి ఫ్లాట్ ను కొంటారు. తన  ఫ్లాట్ ను ఎలా చూసుకుంటారో  అదేవిదంగా  అపార్ట్ మెంట్ ను కుడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమాత్రం నిర్లక్షంగా ఉన్నా తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒకరి నిర్లక్షం కారణంగా మొత్తం అపార్ట్ మెంట్ వాసులు నష్టపోయారు.  అపార్ట్ మెంట్ అన్నాక అందులో నివసించే ప్రతి ఒక్కరికి  భాద్యత ఉంటుందని మరవద్దు.

Saturday 8 December 2012

ఆన్ లైన్ కవులు

 

"ప్రేమను ప్రేమించు... ప్రేమకై!" సభ్యుల మొదటి వసంతం 08-12-12 తేదిన 'అలంకృత రిసార్ట్' లో  కన్నులపండుగగా జరిగింది.  ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన కవిత గారికి, వాసుదేవ్ గారికి, శ్రీనివాస్ (శ్రీ) గారికి, అందుకు సహకరించిన సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు. 



Friday 7 December 2012

వలపుబాణాలు...!

 
నీ సోగకనులు...
మెరిసే నక్షత్రాలు...
నీ ఓరచూపులు...
మదిని గుచ్చే వలపుబాణాలు...!

 (ఈనాడు ఈతరం శీర్షికలోని చిత్రానికి నా స్పందన)


Thursday 6 December 2012

ప్రేమంటే....?

 
ప్రేమంటే....?
వికసించే పుష్పం... 
విరజిమ్మే సుగంధం... 
కురిసే మమకారం... 
విరిసే అనురాగం... 
మురిపించే తీయని రాగం...
మైమరపించే కమ్మనిభావం... 
మాటల మకరందం... 
గాన మాధుర్యం... 
అంతే కాదు!
ఆత్మీయతల నిధి... 
అనురాగాల సన్నిధి... 
ఆప్యాయతల పెన్నిధి... 
అందుకే...!
ప్రేమను ప్రేమించు 
ప్రేమకోసం జీవించు.

Saturday 1 December 2012

మెడలో ఆభరణంలా....

















రాకుమారుడిలా ఉహల్లో కదిలావు 
కస్తూరి తిలకంలా నుదుటున నిలిచావు 
కంటిపాపలా కళ్ళల్లో మెరిశావు 
ఆభరణంలా మెడలో ఒదిగావు 

(ఈనాడు ఈతరం శీర్షికలోని చిత్రానికి నా స్పందన)