”శోధిని”

Thursday 29 September 2011

అవినీతిని అంతం చేద్దాం!

       అన్నాహజారే ప్రారంభించిన అవినీతి ఉద్యమం యావత్ భారతావనికి స్పుర్తినిచ్చింది.  పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అంతా అవినీతిపైనే మాట్లాడుకోవడం శుభసూచకం. నేడు దేశమంతా  అవినీతి అల్లుకుపోవడంతో దేశ ప్రతిష్ట్ట మసక బారుతోంది. అన్ని రంగాలలోను అవినీతి జలగలు పాతుకుపోయాయి. సామాన్యుడు  ప్రభుత్వ కార్యాలయాలకు పనులకోసం వెళ్ళినప్పుడు అక్కడ అవినీతిపరులతో తీవ్ర ఇబ్బందులకు గురవడం చూస్తున్నాము.ఈ అవినీతి భూతాన్ని అంతం చేయడానికి  ఒక బలమైన  స్వయం ప్రతిపత్తిగల చట్టం కావాలి. ఈ చట్టాన్ని అమలు పరచే వారిలో చిత్తశుద్ధి ఉండాలి.  దీనిపై సందేహాలుంటే, వాటిని పరిష్కరించడానికి ప్రధాన న్యాయమూర్తుల సలహాలు తీసుకోవాలి.  అవినీతిలేని సమాజాన్ని చూడాలంటే ప్రతి వ్యక్తి నీతి నిజాయితీగా ఉండాలి. వృత్తి పరంగా  అవినీతిని  ఎంతవరకు నిరోధిస్తున్నమన్నది ఎవరికివారే ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేశంలోని పతివ్యక్తి ఒక అన్నా హజారేలా మారి తమవంతు భాద్యతగా అవినీతిపై ఉద్యమించాలి.  ఇలా పతిఒక్కరు చిత్తశుద్దితో పనిచేస్తే అవినీతిరక్కసిని అంతం చేయవచ్చు.



Wednesday 28 September 2011


ప్రజల భాధలను అర్థం చేసుకోండి!

          గత రెండు వారాలనుంచి రాష్ట్ర ప్రభుత్వం  తెలంగాణా జిల్లాలలో పడకేసింది. ప్రభుత్వ సర్వీసులు కోమాలోకి వెళ్ళిపోతున్నాయి.  ప్రజలు పడే భాధలను అడిగేనాధుడే కరువయ్యారు. ఇటు రాజకీయ పార్టీలు అటు ప్రభుత్వాల నడుమ ప్రజలు నలిగి పోతున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను  పరిష్కరించే వాళ్ళు లేక  అనాదులుగా మిగిలిపోతున్నారు.  ఆర్టీసి  బస్సులు తిరగకపోవడంతో ఆటో చార్జీలు విపరీతంగా  పెంచి ప్రజలను యిబ్బందికి గురి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పజాప్రతినిధులు మాత్రం మిన్నకుండి పోవడం ప్రజల దురదృష్టం. ఇప్పటికయినా అన్నిపార్టీలు కలిసి తెలంగాణా పరిష్కారానికి కృషి చేయాలి.  రెండు ప్రాంతాలవారు  ఒకచోట సమావేసమయి ఒకరి అభిప్రాయాలను మరొకరు  తెలుసుకొని  తెలంగాణా సమస్యను  పరిష్కరించుకోవాలి. త్వరగా  కేంద్ర ప్రభుత్వం  తెలంగాణా సమస్యకు పరిష్కారం చెప్పాలని ప్రజలు వేడుకుంటున్నారు.

Tuesday 20 September 2011

మన జాతీయ గీతాన్ని తప్పులు లేకుండా పాడుదాం!


జన-గణ-మన అధినాయక, జయహే 
భారత-భాగ్య విధాతా!
పంజాబ-సింధు -గుజరాత-మరాఠా 
ద్రావిడ-ఉత్కళ బంగా 
వింధ్య-హిమాచల-యమునా-గంగా 
ఉచ్ఛల-జలధి తరంగా 
తవ శుభ నామే జాగే,
తవ శుభ ఆశిష మాంగే,
గాహే తవ జయ-గాథా
జన-గణ-మంగళ దాయక జయహే 
భారత-భాగ్య విధాతా!
జయహే, జయహే, జయహే,
జయ జయ జయ జయహేII


Wednesday 7 September 2011

హైకూలు

నీ జ్ఞాపకాలు 
సునామీ
చిక్కి బ్రతకగాలనా

****************

మైకుల బెడద 
మళ్లీ మొదలైంది 
ఉపఎన్నికలు 

****************

నీ జ్ఞాపకాల్లో 
నా కలలు ఈదుతూ
నిన్ను మరువలేక 

****************










Monday 5 September 2011

జ్ఞాపకాలు

శూన్యమై మిగిలిన 
నా జీవితంలో 
వెన్నెల దీపాలు 
వెలిగిస్తావనుకున్నాను 
కానీ----
ఆజీవితాన్నేచీకటిగా మార్చి
అందులో నన్ను బంధిస్తావనుకోలేదు
తుషార ఉదయంలాంటి 
నీ ప్రేమజల్లులో 
తడిసి పులకించి పోవాలనుకున్నాను
కానీ---
ఆప్రేమనే నువ్వు  తుపానుగా మార్చి 
సునామీ సృస్టిస్తావని
ఉహించలేదు 
ప్రియా---
నీ జ్ఞాపకాల వెల్లువలో 
నేనొక ఎగసిపడే 
కెరటానయ్యాను 
నీవులేని ఈ మనుగడకు 
నీ జ్ఞాపకాలే చాలు కడవరకు